నేటి నుంచి జంట న‌గ‌రాల్లో ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు

-

పలు సాంకేతిక కారణాల వల్ల జంట నగరాల్లో నడిచే పలు ఎంఎంటీఎస్ రైళ్ల ను ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. నిన్న రాత్రి నుంచి ఈ నెల 23 తేది వ‌ర‌కు ప‌లు ఎంఎం టీఎస్ రైళ్లు ర‌ద్దు అవుతాయని ద‌క్షిన మ‌ధ్య రైల్వే అధికారులు ఒక ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపారు. అయితే కొన్ని రైల్వే మార్గ ల పై మ‌ర‌మ్మ‌త్తులు చేస్తున్నం దున ప‌లు ఎంఎం టీస్ రైళ్లు ను రద్దు చేశామ‌ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రద్దు అయిన రైళ్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి . అలాగే లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లే రైళ్లు ర‌ద్దు అయ్యాయి. అలాగే లింగంపల్లి నుంచి ఫలక్నామా మధ్య నడిచే రైళ్లు తాత్కాలికంగా రద్దు చేయ‌బ‌డ్డాయ‌ని ద‌క్షిన మ‌ధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ విష‌యాన్ని ప్ర‌యాణి కులు అర్థం చేసుకుని ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచు కోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version