కాంగ్రెస్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ దేశాన్ని అస్థిరత వైపు తీసుకెళ్తుందని ప్రధాన నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరాఖండ్లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీ మాట్లాడారు. మూడవసారి అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ అందించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. దేశాన్ని మరింత అభివృద్ధి దశ లోకి తీసుకెళ్తామని చెప్పారు ఉత్తరాఖండ్ మీద బిజెపికి ఉన్న ప్రేమ ఆప్యాయత అందరికీ తెలుసని చెప్పారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు అని చెప్పారు. 60 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో ఈ పదేళ్లలో అంతకంటే ఎక్కువ రెట్టింపు చేశామని చెప్పారు. మూడోసారి మోడీ వస్తే దేశం నిప్పులు కురిపిస్తుందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వాటిపై మోడీ స్పందించారు. 70 ఏళ్ల పాటు దేశాన్ని పాలించి పదేళ్లు అధికారంలోకి దూరమైన వాళ్ళు అగ్గిపెట్టడం గురించి మాట్లాడుతున్నారని అన్నారు.