భార్యా,భర్తలకు మోదీ గుడ్ న్యూస్.. ఏకంగా అకౌంట్లోకి 10 వేలు..

-

ప్రజలకు ఆదాయ భద్రతను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలను అమలు చేస్తుంది. ఎన్నో పథకాల ద్వారా ప్రజలు, లబ్ది పొందుతున్న సంగతి తెలిసిందే..కాగా, అటల్ పెన్షన్ యోజన పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే..ఈ పథకాన్ని 2015 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఆ తర్వాత 2015 మే 9న కోల్‌కతాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. వీటితో పాటు మరో రెండు స్కీంలను కూడా ప్రారంభించారు.

ఆ తర్వాత మరో రెండు పథకాలను కూడా అమల్లొకి తీసుకోని వచ్చారు.అటల్ పెన్షన్ యోజన విషయానికి వస్తే.. పదవీ విరమణ అనంతర జీవితం కోసం స్వచ్ఛందంగా పొదుపు చేసుకునేలా ఈ స్కీం ప్రోత్సహిస్తోంది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గల భారతీయ పౌరులెవరైనా.. ఈ స్కీమ్ కింద తమ పేరును నమోదు చేసుకునే అర్హత ఉంటుంది.

60 ఏళ్లు వయసు నిండిన నాటి నుంచి ఈ స్కీమ్ కింద నెలకు రూ. 1000 నుంచి రూ.5000 కనీస పింఛనుకు ఇది హామీ ఇస్తుంది. పై మూడు పథకాల్లో ఎక్కువగా అటల్ పెన్షన్ యోజన కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పథకాలలో బాగా పాపులర్ అయింది. 2021-22లో ఈ స్కీమ్‌లో 64 లక్షల మంది చేరారు. ఇప్పటికే ఈ స్కీమ్‌లో చేరిన వారి సంఖ్య 3.68 కోట్లుగా నమోదు కావడం విశేషం.

ఈ స్కీమ్‌లో భార్యాభర్తలు ఇద్దరూ చేరొచ్చు. ఇద్దరికీ 60 ఏళ్ల వయసు నుంచి నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్ వస్తుంది. అంటే భార్యాభర్తలు ఇద్దరూ ఈ స్కీమ్ ద్వారా నెలకు రూ.10 వేల పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. వయసు ఎంత తక్కువగా ఉన్నప్పుడు ఈ స్కీమ్‌లో చేరి, పొదుపు చేస్తే అంత ఎక్కువ లాభం వస్తుంది.18 ఏళ్లు ఉన్నప్పుడు చేరితే నెలకు రూ.42 నుంచి రూ.210 వరకు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. వయసు పెరుగుతున్న కొలది ఈ మొత్తం పెరుగుతూ ఉంటుంది. అటల్ పెన్షన్ స్కీమ్ కింద కనీసం 20 ఏళ్లు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌గా లేదా బ్యాంకుల వద్ద అటల్ పెన్షన్ దరఖాస్తు ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన సమాచారమంతా నింపాలి.వాలిడ్ మొబైల్ నెంబర్‌ తో పాటు.. ఆధార్ కార్డు ఫోటోకాఫీని కూడా ఇవ్వాలి. అప్లికేషన్ అప్రూవల్ అయిన తర్వాత మీకు కన్‌ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. రూ.1000 పింఛన్ రావాలంటే.. నెలకు రూ.42 కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది.రూ.5 వేలు పెన్షన్ కోసం నెలకు రూ. 210 కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అదే త్రైమాసికంగా రూ. 626, అర్థవార్షికంగా రూ. 1,239 కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. నామినీకి ఏక మొత్తంలో రూ. 8.5 లక్షలు చెల్లిస్తారు. ఈ రకంగా భార్యాభర్తలకు రూ. 10 వేలు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version