కరోనాని తేలికగా తీసుకోలేం, మూడోవ ప్రపంచ యుద్ధం వచ్చింది; మోడీ

-

కరోనా వైరస్ పై జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని మోడీ సూచించారు. కరోనా వైరస్ తో ప్రపంచం యుద్ధం చేస్తుందన్నారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఇది చాలా ప్రమాదకరమైన వైరస్ అని అన్నారు. కరోనా కన్నా సీరియస్ అంశం ఇప్పుడు ఏదీ లేదని అన్నారు. కరోనా వైరస్ ని తేలికగా తీసుకోలేమని అన్నారు.

ఇప్పటి వరకు కరోనాకు చికిత్స లేదు వైద్యం లేదని ఆయన హెచ్చరించారు. మొదటి ప్రపంచం యుద్ధం నాటి పరిస్థితులు వచ్చాయని మోడీ కీలక వ్యాఖ్యలు చేసారు. మీ జీవితంలో కొన్ని వారాలు నాకు ఇవ్వండని మోడీ కోరారు. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు కూడా ప్రజలు ఇంత ఇబ్బంది పడలేదని మోడీ వ్యాఖ్యానించారు. ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉందని మోడీ అన్నారు. ఇప్పటి వరకు కరోనాకు వ్యాక్సిన్ లేదని అన్నారు.

ఇంకొన్ని వారాలు దేశ ప్రజలు త్యాగం చెయ్యాలని, కరోనాపై యుద్ధం చేయడానికి దేశ ప్రజలు సహకరించాలని అన్నారు. ఇప్పటి వరకు నా మాట మన్నించారు నా మాట విన్నారు. ఇప్పుడు కూడా నాకు సహకరించందని కోరారు. అభివృద్ధి చెందిన దేశాలు అన్నీ కరోనా బారిన పడ్డాయని అన్నారు. మానవ జాతిని కరోనా వైరస్ ప్రమాదంలోకి నెట్టిందని మోడీ ఆవేదన వ్యక్తం చేసారు.

కరోనా బాధితులు అందరిని ఐసోలేషన్ కి తరలిస్తున్నామని అన్నారు. నీ స్వచ్చతే జాతి స్వచ్చత అని అన్నారు. కరోనా మనకు రాకుండా చూడాలి, ఇతరులకు సోకకుండా చూసుకోవాలని అన్నారు. కరోనా అన్ని దేశాలకు సోకింది మన దేశం అతీతం కాదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సూచనలు పాటించాలని అన్నారు. సమూహాలకు దూరంగా ఉండమని కోరారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా చూడాలని అన్నారు.

రానున్న కొద్ది వారాల పాటు ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా చూడాలని అన్నారు. ఉద్యోగం అయినా వ్యాపారం అయినా సరే ఇంటి నుంచే చేసుకోవాలని మోడీ సూచించారు. మనం ఆరోగ్యంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని మోడీ వ్యాఖ్యానించారు. సంకల్పం నిబద్దత చాలా అవసరమని మోడీ వ్యాఖ్యానించారు. సోషల్ డిస్టన్సింగ్ చాలా అవసరం అన్నారు. సీనియర్ సిటిజెన్స్ బయటకు వెళ్ళకుండా ఉండాలని మోడీ వ్యాఖ్యానించారు.

అభివృద్ధి చెందుతున్న భారత్ కి కరోనా పెద్ద దెబ్బ అని ప్రధాని ఆవేదన వ్యక్తం చేసారు. కొద్ది రోజుల్లో బాధితుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. భారత్ పై కరోనా ప్రభావం లేదని అనుకోవడం తప్పని అన్నారు. ఇంటి నుంచి బయటికి రావడానికి ఒకటికి మూడుసార్లు ఆలోచించాలని మోడీ కోరారు. వారం పాటు ఇళ్ల నుంచి బయటికి రావొద్దన్నారు. మీకుకావల్సిన వస్తువులు మీ ఇంటికి తరలిస్తామని అన్నారు.

అత్యవసర వస్తువులను బ్లాక్ చేయవద్దని రోజు వారి వైద్య పరిక్షల కోసం బయటకు వద్దని మోడీ వ్యాఖ్యానించారు. అవసరమైన పక్షంలో కుటుంబ వైద్యులను సంప్రదించమని, సర్జరీలు అవసరం అయితేనే చేయించుకోవాలి గాని ఇప్పుడు బయటకు వెళ్ళవద్దని ఆయన అన్నారు. సమూహాలకు దూరంగా ఉండటమే కరోనాకు మందు అన్నారు. ఇంటి నుంచి అసలు బయటకు వెళ్ళవద్దని ఆయన కోరారు.

22 వ తేదీ సాయంత్రం ఉదయ౦ 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ విధించుకోవాలి అని మోడీ సూచించారు. మన కోసం డాక్టర్లు నర్సులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని అభినందించారు. డాక్టర్లు నర్సులకు కరోనా సోకే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా మధ్యలో వైద్యులు యుద్ధం చేస్తున్నారని కొనియాడారు. ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తినకుండా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసామని, ఆర్ధిక మంత్రి ఆధ్వర్యంలో పని చేస్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version