ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పెద్ద అమరిన్ లోని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంశ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఆవిష్కరించారు.గవర్నర్ విశ్వ భూషణ్ హరిచంద్ర న్, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రి రోజా అలాగే కేంద్ర మాజీ మంత్రులు చిరంజీవి, పురందరేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శాలువాతో సన్మానించారు.
ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ..తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. “మన్యం వీరుడు, తెలుగుజాతి యుగ పురుషుడు, తెలుగువీర లేవరా..దీక్షబూని సాగరా..స్వతంత్ర సంగ్రామంలో యావత్ భారతావనికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేల మీద మనమందరం కలుసుకోవడం మన అదృష్టం”. అంటూ తెలుగులో ప్రసంగించారు.