ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరా ఖండ్ పర్యటన లో ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి వచ్చిన వెంటనే ప్రధాని మోడీ ని అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేదరేంద్రునికి మోడీ ప్రత్యేక పూజలు చేశారు. అలాగే అర్చకులు ప్రధాని మోడీ కి తీర్థ ప్రసాదాలు అందించారు.
అనంతరం కేదార్ నాథ్ లో ఆది శంకరా చార్యల సమాధి స్థల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. అనంతరం ఆది శంకరా చార్యలు విగ్రాహాన్ని ప్రధాని మోడి ప్రారంభించాడు. ఆది శంకరా చార్యల విగ్రహాం గతంలో ఉన్నా.. వరుదలు కారణంగా ఆ విగ్రహాం కూలిపోయింది. దీంతో ఆది శంకరా చార్యలు విగ్రహాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో పునః నిర్మించారు. దీంతో తాజాగా ప్రధాని మోడీ ఈ రోజు ఆది శంకరా చార్యల విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అయితే ఈ విగ్రహాం 12 అడుగుల ఎత్తు ఉంది. అలాగే 35 టన్నుల బరువు తో బలంగా ఉంది.