బీర్ ని ఎందుకు ఆకుపచ్చ లేదా బ్రౌన్ బాటిల్స్ లో స్టోర్ చేస్తారు..? కారణం తెలుసా..?

-

సాధారణంగా బీర్ బాటిల్స్ రంగులని మనం గమనించినట్లయితే ఆకుపచ్చ లేదా బ్రౌన్ కలర్ బాటిల్స్ లో బీర్ ని స్టోర్ చేస్తారు. అయితే ఎందుకు ఇలా స్టోర్ చేస్తారు..? దాని వెనుక కారణం ఏమైనా ఉందా..? లేదంటే ఆకర్షణంగా కనపడడానికి అలా చేస్తారా అనే విషయాలని ఇప్పుడు చూద్దాం. బీర్ బాటిల్స్ ని ఎక్కువగా బ్రౌన్ కలర్ లేదా ఆకుపచ్చ రంగులు బాటిల్స్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 19వ శతాబ్దం నుంచి కూడా బ్రువెర్స్ గ్లాస్ బాటిల్స్ లో స్టోర్ చేయడం జరిగింది. బీర్ ని గ్లాస్ బాటిల్స్ లో స్టోర్ చేస్తే మంచిదని వాళ్లు భావించారు. ముఖ్యంగా ఈ రెండు రంగుల్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారనే దాని వెనుక కారణం ఉంది. ముందు ప్లెయిన్ బాటిల్స్ లో బీర్ ని నిల్వ ఉంచేవారు.

అలా చేయడం వలన సూర్యకిరణాలు పడడంతో ఫ్లేవర్ మారిపోయేది. రుచి తగ్గిపోయేది. సూర్యకిరణాలు ప్లెయిన్ బీర్ బాటిల్స్ పై పడటం వలన వాసన కూడా మారిపోయేది. యూవీ కిరణాలు బీర్ బాటిల్స్ పై పడటం వలన దుర్వాసన కూడా వచ్చేది. అందుకని అప్పటి నుంచి కూడా ప్లైన్ గాజు బాటిల్స్ లో స్టోర్ చేయడం మానేశారు. బ్రౌన్ కలర్ బాటిల్స్ లో స్టోర్ చేయడం మొదలుపెట్టారు. ఒకవేళ యూవీ కిరణాలు వాటిపై పడిన ఎలాంటి మార్పు జరగలేదు ఎలా ఉన్న బీర్ అలాగే ఉండేదట. వరల్డ్ వార్ టూర్స్ సమయంలో బ్రౌన్ బాటిల్స్ తగ్గిపోవడం వలన ఆకుపచ్చ రంగు బాటిల్స్ లో స్టోర్ చేయడం మొదలుపెట్టారు.

దాని వలన కూడా ఎలాంటి మార్పు జరగలేదని ఆకుపచ్చ బ్రౌన్ కలర్ గాజు సీసాలో బీర్ ని స్టోర్ చేయడం మొదలుపెట్టారు. అలా ఈ రెండు రంగులను ఉపయోగించడం జరిగింది. ఒకవేళ కనుక గాజు సీసాలు ట్రాన్స్పరెంట్ గా ఉంటే చాలా బాగా బీర్ కనపడుతుందని నాణ్యత మరియు విజిబిలిటీని మెయింటైన్ చేయడానికి మ్యానుఫ్యాక్చర్ లు యువీ ప్రొటెక్టివ్ కోటింగ్స్ వేయడం జరిగింది. ఇలా చేయడం వలన బీర్ ఫ్రెష్ గా ఉండటమే కాకుండా లైట్ వలన ఎలాంటి నష్టం వాటిల్లదని.. ఈ విధంగా మార్చారు. తర్వాత గాజు సీసాలు కమర్షియల్ పర్పస్ కోసం ఎక్కువగా వాడడం జరిగింది. ఇది బీర్ ని ఆకుపచ్చ, బ్రౌన్ కలర్ బాటిల్స్ లో స్టోర్ చేయడం వెనుక ఉన్న కారణం.

Read more RELATED
Recommended to you

Exit mobile version