ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు తాలిబన్ల అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రజలే ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తుంటే విదేశాలకు చెందిన ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో భారత్ తమ పౌరులను వెనక్కి రప్పిస్తున్న సంగతి తెలిసిందే.
ఈమేరకు ప్రత్యేక విమానం ను ఏర్పాటు చేసింది. కాగా తాజాగా భారత పౌరులను సురక్షితంగా తీసుకోవాలని ప్రధాని మోడీ ఆదేశించారు. ఆఫ్ఘనిస్తాన్ లోని తాజా పరిస్థితులపై చర్చించేందుకు మంగళవారం ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడి పరిణామాల పై ప్రధాని చర్చించారు. అక్కడున్న హిందువులకు ఆశ్రయం కల్పించాలని మోడీ ఆదేశించారు. అంతే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ లో మన సహాయం కోసం ఎదురు చూస్తున్న ఆఫ్ఘనిస్తాన్ సోదరసోదరిమనలను వీలైనంత వరకు ఆదుకుంటామని ప్రధాని స్పష్టం చేశారు.