భారత ప్రధాని మోడీ మంగళవారం 74వ పుట్టిన రోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఆయనకు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ శ్రేణులు, అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.అంతేకాకుండా ఆయన అభిమానులు దేశవ్యాప్తంగా పలు చోట్ల వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే, మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని పలువురు పూజలు,ప్రార్థనలు సైతం చేశారు.
ఈ క్రమంలోనే ప్రధాని మోడీ బర్త్ డే సందర్బంగా రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గా 4వేల కిలోల శాఖాహారాన్ని పంపిణీ చేసింది.‘సేవా పఖ్వాడా’వేడుకల్లో భాగంగా దర్గాలో 550ఏళ్ల నాటి ప్రసిద్ధ బిగ్ షాహీ దేగ్ (పెద్ద పాత్ర)లో ఈ ఆహారాన్ని వండారు. బియ్యం, స్వచ్ఛమైన నెయ్యి, పండ్లతో తయారుచేసిన ఈ ఆహారాన్ని భక్తులకు, పేదలకు అందిస్తారు. ఓ ప్రధాని పుట్టినరోజు సందర్బంగా ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.