పార్టీ ముఖ్యనేతలకు, మాజీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబునాయుడు దసరా గిప్ట్ లు సిద్దం చేస్తున్నారు.. వారితో పాటు బిజేపీ, జనసేన నేతలకు కూడా ఇవ్వబోతున్నారు.. ఇదే ప్రస్తుతం పార్టీలో హాట్ డిస్కర్షన్ గా మారింది.. కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు కాబోతుంది.. ఇదే సమయంలో విజయదశమి కూడా రాబోతుంది.. దీంతో నేతలకు నామినెటెడ్ పదవుల రూపంలో గిస్ట్ లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు..
నామినెటెడ్ పదవుల పందేరంపై గత కొంతకాలంగా ఉత్కంఠ కొనసాగుతోంది.. దీనికి చంద్రబాబునాయుడు పుల్ స్టాప్ పెట్టుబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.. పార్టీ కోసం టిక్కెట్లు త్యాగం చేసిన నేతలతో పాటు.. మాజీ ఎమ్మెల్యేల లిస్ట్ ను చంద్రబాబునాయుడు ఇప్పటికే సిద్దం చేశారట.. బిజేపీ, జనసేన అద్యక్షులతో మాట్లాడి.. వారి వద్ద నుంచి కూడా జాబితాను తీసుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.. టీడీపీకి 60, జనసేనకు 30, బీజేపీకి 10 అన్న నిష్పత్తిలోనే మొత్తం పదవుల పంపిణీ ఉంటుందని.. దాని మీద మూడు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి..
నామినెటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఒకటి రెండు రోజులలో మొదలు పెట్టి పదవులను పందేరం చెయ్యాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారట.. దసరా తర్వాత కొన్ని.. దసరాముందు మరికొన్ని పదవులను అనౌన్స్ చెయ్యాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీలో 24 మందికి జనసేనలో 12 మందికి బీజేపీలో నలుగురుకీ చైర్మన్ కిరీటాలు దక్కనున్నాయని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు..
ఎవరెవరికి ఏయే కార్పోరేషన్ల పదవులు ఇవ్వాలనే దానిపై ఇప్పటికే చంద్రబాబు కసరత్తు చేశారని.. కీలకరమై పదవుల్లో టీడీపీ నేతలే ఉండేలా జాగ్రత్తలుతీసుకుంటున్నారని పార్టీ ముఖ్యనేతలు మాట్లాడుకుంటున్నారు.. నెల్లూరు. కడప, ఉత్తరాంద్ర నేతలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి టీడీపీ, జనసేన సిద్దమైంది.. ఈ జిల్లాలోని నేతలే పార్టీ కోసం టిక్కెట్లు త్యాగం చేశారట.. ఈ నేపథ్యంలో దసరా లోపే పదవులు భర్తీ చెయ్యాలని సీఎం చంద్రబాబు ఆలోచనగా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.. ఈ క్రమంలో ఎప్పుడైనా.. నేతలకు పదవులు దక్కే చాన్స్ ఉందన్నమాట..