దేశ రాజకీయాల్లో వారసత్వం కామనే. ప్రతీ పార్టీలో వారసత్వ రాజకీయాలు నడుస్తుంటాయి. మా పార్టీలో లేవని చెప్పుకున్నా ఇతర రాష్ట్రాల్లో కనిపిస్తూనే ఉంటాయి. ఐతే తాజాగా బీజేపీలో మోడీ వారసులకి టికెట్ దక్కకపోవడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబ రాజకీయాలని ప్రోత్సహించరు. అలా అని బీజేపీలో వారసత్వ రాజకీయాలు లేవా అంటే అదీ కాదు. కానీ మోదీ కుటుంబం నుండి మాత్రం ఎవ్వరూ రాజకీయాల్లో లేరు. తాజాగా మోడీ తమ్ముడి కూతురు సోనాల్ అహమ్మదాబాద్ కార్పోరేషన్లో పోటీ చేయాలని అనుకుంది.
అందుకోసం తన పేరు ఇచ్చినప్పటికీ చివర్లో పోటీ చేసే వారి లిస్టులో సోనాల్ కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. మోడీ తమ్ముడి కూతురుకి టికెట్ దక్కకపోవడం వల్ల ఆశ్చర్యానికి గురవుతున్నారు. అహమ్మదాబాద్ తో పాటు సూరత్, వడోదర, జామ్ నగర్, భావ్ నగర్ నగరాల్లోనూ ఎలక్షన్లు జరగనున్నాయి. ఈ నగరాల్లో బీజేపీ, చాలా రోజుల నుండి ఆధిక్యంలో ఉంది. మరి ఈ సారి ఏం జరగనుందో చూడాలి.