టీమిండియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా అనుభవజ్ఞుడైన పేస్ బౌలర్ మహ్మద్ షమీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో షమీకి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో సెప్టెంబర్ 20 అంటే ఎల్లుండి నుండి మొహాలీలో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు పేస్ బౌలర్ మహ్మద్ షమీ.
ఇదే విషయాన్ని బీసీసీఐలోని ఓ అధికారి తెలిపారు. “అవును, షమీకి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. కానీ లక్షణాలు స్వల్పంగా ఉన్నందున ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ అతను ఒంటరిగా ఉండవలసి ఉంటుంది మరియు అతను నెగెటివ్ పరీక్షించిన తర్వాత తిరిగి జట్టులో చేరుతాడు. ఇది దురదృష్టకరం”అని బిసిసిఐ సీనియర్ అధికారి పేర్కొన్నాడు. ఇక పేస్ బౌలర్ మహ్మద్ షమీ స్థానంలో వెటరన్ పేసర్ ఉమేష్ యాదవ్… టీమిండియా తరఫున బరిలోకి రానున్నాడు.