Mohan Raja: చిరంజీవి బాటలో రామ్ చరణ్..వారసత్వంపై మోహన్ రాజా కామెంట్స్ ఇవే..

-

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేయగా, ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. ఈ పిక్చర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో అతిరథ మహారథులు, మెగా అభిమానుల మధ్య ఘనంగా జరిగింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి తదుపరి సినిమా ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్ మోహన్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన జీవితంలో ‘ఆచార్య’ తన తండ్రి ఎడిటర్ మోహన్ అని మోహన్ రాజా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే చిరంజీవితో వర్క్ చేయడం గొప్ప విషయమని, ఆ అవకాశం తనకు మెగాస్టార్ ఇచ్చారని చెప్పారు. తన తొలి సినిమా ‘హనుమాన్ జంక్షన్’ తెలుగులో తీయగా 20 ఏళ్ల తర్వాత మళ్లీ ‘గాడ్ ఫాదర్’ చేస్తున్నట్లు తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా వివరించారు.

ఇక రామ్ చరణ్ గురించి మోహన్ రాజ్ ఇంట్రెస్టింగ్ మాటలు మాట్లాడారు. తన దర్శకత్వంలో వచ్చే ‘గాడ్ ఫాదర్’ సినిమాలోని డైలాగా రామ్ చరణ్ కు సూట్ అవుతుందని పేర్కొన్నారు. ‘‘వారసత్వం అంటే పదవి కాదు బాధ్యత..’’అని పేర్కొన్న మోహన్ రాజా.. ఈ వాక్యం రామ్ చరణ్ కు యాప్ట్ గా సూట్ అవుతుందని స్పష్టం చేశారు.

‘గాడ్ ఫాదర్’ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయిందని, టాకీ పార్ట్ త్వరలో కంప్లీట్ అవుతుందని మోహన్ రాజా మాటల ద్వారా స్పష్టమవుతోంది. ‘ఆచార్య’ తర్వాత రాబోయే మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘గాడ్ ఫాదర్’ అని మోహన్ రాజా క్లారిటీనిచ్చేశారు. దాంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version