హైదరాబాద్‌లో మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ ను అరెస్ట్ చేసారు మొయినాబాద్ పోలీసులు. పలువురు వీవీఐపీలు పేరుతో మోసాలకు పాల్పడ్డ సయ్యద్ బురానుద్దీన్.. రాహుల్ గాంధీ పీఏ నంటూ ఛత్తీస్‌ఘడ్ లో మోసాలు చేసారు. ఏకంగా ఛత్తీస్‌ఘడ్ సీఎం కార్యాలయం సిబ్బందికే టోపి పెట్టాడు. మైనింగ్ ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయల మేర మోసం చేసాడు. ఓ ఐఏఎస్ అధికారున్ని సైతం మోసం చేసిన ఈ ఘనుడు.. పీఎం కార్యాలయంలో పనిచేస్తున్నానంటూ ఐఏఎస్‌ను నమ్మించాడు.
ఐఏఎస్ పై అప్పటికే కొనసాగుతున్న సిబిఐ ఎంక్వయిరీ ని రద్దు చేపిస్తానంటూ కోటిన్నర రూపాయలు తీసుకొని పారిపోయాడు. హైదరాబాదులో ఓ బిజినెస్మెన్ కు ఈడి అధికారులు నోటీసులో జారీ చేసిన విషయం తెలిసి ఆ వ్యాపారిని కూడా మోసం చేసాడు ఈ ఘనుడు. నకిలీ ఈడీ కార్యాలయాన్నే సృష్టించిన కేటుగాడు.. అదే కార్యాలయానికి వ్యాపారిని పిలిపించి కోట్ల రూపాయలు వసూలు చేసాడు. అయితే మొయినాబాద్ లో రెండేళ్ల క్రితం ఓ భూ కబ్జా చేసే ప్రయత్నంలో కేసు నమోదు కాగా.. ఈ కేసు దర్యాప్తులో సయ్యద్ బురానుద్దీన్ ను అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు. ఈ విచారణలో వెలుగులోకి వచ్చాయి సయ్యద్ బురానుద్దీన్ ఘరానా మోసాలు.