కొంప ముంచుతున్న క్యాష్ బ్యాక్ కక్కుర్తి…!

-

ఆన్లైన్ లో క్యాష్ బ్యాక్ ఆఫర్లు వస్తున్న తరుణంలో కొందరు ప్రవర్తిస్తున్న తీరు మరీ ఆందోళన కలిగిస్తుంది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్ లో ఆఫర్లు బాగా వస్తున్నాయి. దీనితో ఆఫర్లకు కక్కుర్తి పడుతున్న జనం వాటికి సంబంధించి ఏ లింక్ వచ్చినా సరే క్లిక్ చేయడం మొదలుపెట్టారు. క్లిక్ చేస్తే అంత క్యాష్ బ్యాక్ ఇంత క్యాష్ బ్యాక్ అంటూ ఆఫర్లు వస్తున్నాయి. మొబైల్ ఫోన్స్ వస్తాయి అనే ఆఫర్లు కూడా కొన్ని మెసేజ్ రూపంలో వస్తున్నాయి.

దీనిపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ స్థాయిలో మోసాలు జరుగుతున్నా సరే ఏదో వస్తుంది అని క్లిక్ చేస్తున్నారు. హైదరాబాద్ లో చదువుకున్న వాళ్ళు కూడా వాటిని నమ్మి లింక్స్ క్లిక్ చేయడం గమనార్హం. దీనిపై ఎన్ని హెచ్చరికలు చేసినా సరే ప్రజల తీరులో మాత్రం ఏ విధంగా మార్పు రావడం లేదు. హైదరాబాద్ లో పది రూపాయల క్యాష్  బ్యాక్ కి కక్కుర్తి పడి లక్ష రూపాయల వరకు కోల్పోయాడు ఒక వ్యక్తి.

సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం అవుతున్న లింక్స్ చూసి ఎక్కువగా మోసపోతున్నారు జనాలు. ఏ విధంగా హెచ్చరికలు చేసినా సరే వాటిని నమ్మడం ఆందోళన కలిగిస్తుంది. చిత్తూరు జిల్లాలో వాట్సాప్ లో వచ్చిన ఒక లింక్ ని క్లిక్ చేసి 5 వేల వరకు పోగొట్టుకున్నాడు ఒక వ్యక్తి. దీని మీద మీరు పోలీసులకు ఫిర్యాదు చేసినా సరే ఉపయోగం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version