సచివాలయ ఉద్యోగాల ఫలితాల్లో.. షాకింగ్ న్యూస్..?

-

ఏపీలో ఇటీవలే సచివాలయ ఉద్యోగాల పరీక్షలు ముగిశాయి. దాదాపు 20 లక్షల మంది వరకూ ఈ పరీక్షలు రాశారు. ఈ పరీక్ష ఫలితాను రికార్డు సమయంలో ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ పరీక్షల్లో గోల్ మాల్ జరిగిందని కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. దాన్ని ప్రభుత్వం ఖండిస్తోంది. సరే ఈ విషయాన్ని పక్కకు పెడితే.. అనేక ఇంట్రస్టింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి.

సాధారణంగా పోటీ పరీక్షల్లో టాప్ ర్యాంకర్లకు నూటికి 90 శాతం వరకూ మార్కులు వస్తుంటాయి. సచివాలయ ఉద్యోగాల పరీక్ష పత్రాలు 150 మార్కులకు ఉన్నాయి. అంటే.. కనీసం టాప్ ర్యాంకు 135 నుంచి 140 మార్కుల వరకూ ఉండొచ్చు.

కానీ ఈసారి ప్రశ్నాపత్రం మరీ సివిల్స్ రేంజ్ లో ఉందని.. చాలా కఠినంగా ఉందని అభ్యర్థులు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే టాప్ ర్యాంకు 125 వరకూ ఉండొచ్చనుకున్నారు. కానీ..ఆ అంచనా కూడా తలకిందులైంది. టాప్ ర్యాంకు 112 మార్కులే.

అంతే కాదు.. కేటగిరీ వన్ పరీక్ష కోసం దాదాపు 11న్నర లక్షల మంది హాజరయ్యారు. ఇంత మంది రాసినప్పుడు.. 100 మార్కులు దాటే వారి సంఖ్య కూడా వేలల్లోనే ఉంటుంది. కానీ ఈసారి.. 11న్నర లక్షల మందిలో 100 మార్కులు దాటిన వారు ఎందరో తెలుసా.. కేవలం 63 మందేనట. పోటీ పరీక్షల చరిత్రలోనే ఇది ఓ రికార్డుగా చెప్పుకుంటున్నారు. అంతే కాదు మొత్తం పరీక్ష రాసిన 20 లక్షల మందిలో వంద మార్కులు దాటిన వారు అన్ని విభాగాలు కలిపి కేవలం 1005 మందేనట.

కేటగిరీ 2A లో లక్షా 16 వేల మంది పరీక్ష రాస్తే… కేవలం 314 మంది మాత్రమే సెంచరీ కొట్టారట. కేటగిరీ 2Bలో లక్షా 20 వేల మంది రాస్తే.. 488 మంది మాత్రమే 100 మార్కులు దాటించారట. ప్రశ్నాపత్రం మరీ ఇంత కష్టంగా ఉంటే.. అసలైన ప్రతిభావంతులకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version