మార్నింగ్ రాగా : రిట‌ర్న్ ఇన్ ద సెన్స్

-

చెడు అన్న‌ది సైన్సులో ఉందా..లేకా ప్రేమ‌లో ఉందా..శాస్త్రాన్ని శాసించే లోకంలో ఉందా ..ఏదో ఒక‌టి తిరిగి ఇవ్వండి అంటే మ‌న‌స్సులు ఒప్పుకోవు..మీ అచేత‌న‌లు ఒప్పుకోవు.. రాత్రి పొందిన వాంఛ‌ల అంగీకారాలు ఒప్పుకోవు..ఇప్పుడ‌యినా ఈ చావు నుంచి గ‌ట్టెక్కించాలంటే మ‌ళ్లీ మీలో అనైతిక‌తే మేల్కోవాలి/ఆ అనైతిక‌త‌తోనే అర్ధ‌ర‌హిత మాట‌లు రాస్తారు అర్ధ‌‌ర‌హిత రాత‌లు రాస్తారు. ప్ర‌యోగాలు చేయించి శ‌వాల‌కు దేహాల‌కు మ‌ధ్య ఉంచి ఎంత రేటు ప‌లుకుతాదో వేచి చూస్తారు. మీరు అనామ‌క శ‌వాలు అయ్యాక‌నే నేను ఆనందిస్తాను..దేశాధ్యక్ష ప‌ద‌వుల్లో ఉన్న కొంద‌రు ఇలానే అయిపోతే మేలు లేదా అనైతిక‌త‌లో ఉన్నవారంతా ఇలాంటి శ‌వాల దిబ్బ‌ల‌కు చేరిపోతే మేలు..

కోటి మంది ఆకాంక్ష‌లు వాటిని దాటి..అక్షాంశాలో రేఖాంశాలో సంబంధిత విల‌యాలో..ప్ర‌ళ‌యాలో ప్ర‌ళ‌య కాల సంవ‌ర్త‌న‌లో ఏవో ఒక‌టి నీ నుంచి బ‌య‌టప‌డ‌ని ఓ కాంక్ష‌గా మారిపోయి..ముసుగు వేసుకుని ఉంటున్నాయి.. అయినా ఈ మ‌నుషులు శ‌వాల దిబ్బ‌ల‌కు సంస్క‌ర‌ణ వాదాల‌ను వినిపించి కొత్త వ్యాక్సిన్ల త‌యారీపై పేటెంట్ల కోసం కొట్టుకు ఛ‌స్తున్నారు..దేశాలు మంచివి దేశాధ్యక్షులు చ‌నిపోయేదాకా చెడ్డ‌వారు చచ్చేకే వారి మంచి వారి భ‌జ‌న వారి కీర్త‌న అంతిమం నుంచి ఆదివర‌కూ జ‌న్యు ప‌టాల విస్త‌ర‌ణ వివ‌ర‌ణ అన్న‌వి మ‌న నెత్తి మీద‌కు వ‌స్తాయి.. అనైతిక‌త ఉన్నంత కాలం ప‌త్రిక‌లు అమ్ముడుపోతాయి..అంగాంగ వ‌ర్ణ‌న‌లు ఉంటే క‌విత్వాలు.. సినిమాలు ద‌రిద్ర‌గొట్టు పాట‌లు అన్ని అన్నీ అమ్ముడ‌వుతాయి.

త‌న‌తో మాట్లాడుతున్నాను.. మీరు సంతోషంగా ఉంటానంటే నేను ఏమ‌యినా చేస్తాను అని అంటోంది.. దేహాల‌ను ఇచ్చేందుకు సంకోచం లేన‌ప్పుడు ప్రేమ‌ల‌ను పొందేందుకు ఎందుక‌ని సందిగ్ధం అని న‌వ్వుకున్నాను.. కొత్త గా ఈ దారిలో ప్ర‌యాణించిన ప్ర‌తిసారి పిడికెడు ప్రేమ అన్న‌ది మ‌న గుప్పిట ఉందా లేదా అన్న మీమాంస‌లో కొట్టుకు ఛ‌స్తాను.,. ఊరికి వెళ్లి వ‌స్తున్న ఆమెను చూస్తున్నాను.. ఆమె పెద్ద‌ల‌కు న‌మస్క‌రించి ఇంటికి వ‌స్తుంది..వస్తుంది ఆ ఇంటి వెన్నెల‌ను నా ఇంటి దాకా ప‌రిచితం చేయాల‌న్న వాంఛ త‌న‌లో ఉంది.. మీ కోసం ఏమ‌యినా చేస్తాను.. మీరు ఆనందంగా ఉంటారా చెప్పండి..

ఈ దేహం – ఈ ప్రాణం అన్నీ అన్నీ మీ కోసం అంటున్న ఒక జ‌వ‌రాలి మాట‌లు వింటున్నాను..హాయిగా న‌వ్వుతున్నాను.. కోటి మ‌నుషుల ఆకాంక్ష‌ల‌లో ఇలాంటివి ఎన్ని విని ఉంటాను.. ఆక‌లి ఉన్న చోట న‌వ్వులు రువ్వితే అవి తీరుతాయా.. ప్రేమ అర్థ‌విహీన ఛాయాల్లో ఉంటే క‌న్నీళ్లు వ‌చ్చి వాటికి ప‌రిష్కారం అందించిపోతాయా.. స్వీయ విచ‌క్ష‌ణ లేని మ‌నుషుల శ‌వాల‌ను నేను చూడాలి అని భావిస్తే కాలం అందుకు అనుగుణంగా ఏమయినా ఆజ్ఞ‌లు జారీ చేసిపోతుందా.. ఏమ‌యినా స్త్రీ దేహం అయినా ప్ర‌కృతి అయినా పిరియాడిక‌ల్ ఆర్డ‌ర్ ను మిస్ చేసుకోకూడ‌దు.. లేదా గ‌తి త‌ప్పిందా క‌ర్మ కాలిందే.. హాహాహా రాత్రి త‌న‌తో ఎన్ని మాట‌లు చెప్పానో.. త‌న దేహంపై రువ్విన మౌనాల‌ను ఏమ‌యినా ర‌ద్దు చేసిందో కొడ్తాను.. ప్రేమ, ప్రేమ సంబంధ వ్య‌క్తీక‌ర‌ణ దేహాల‌పై అముద్రితాలుగా మారితే ఏం చేయను..

లోకంలో బాధ్య‌త అన్న‌ది విస్మ‌ర‌ణ‌లో ఉంది.. విపత్తు కాలాల్లో కూడా విచ‌క్ష‌ణ అన్న‌ది పాటింపు లేకుండా ఉంది.. రాజ‌కీయ శ‌క్తుల‌కు ప్ర‌జ‌లంటే క‌ప‌ట ప్రేమ ఉన్న కార‌ణంగా కోట్ల రూపాయలు కొన్ని గోడల్లోనో గ‌దుల్లోనో ఇరుక్కుపోయి, అలానే ఉండిపోతున్నాయి.. ఇలాంటి శ‌క్తుల ప్రేరేపిత శ‌క్తుల‌కు కీడు జ‌రిగితే సంతోషిస్తాను.. కానీ అది జ‌ర‌గ‌డం లేదు.. ఏదో ఒక‌టి తిరిగి ఇవ్వాలి.. ప్రాణ శ‌క్తుల‌ను కూడ‌దీసుకుని ఏదో ఒక‌టి తిరిగి ఇవ్వాలి.. ఇవ్వ‌డం అన్న‌ది ఓ ప్ర‌శ్న‌గా మారిపోతున్నప్పుడు సందిగ్ధాల‌ను మ‌న‌కు మ‌నం ర‌ద్దు చేయడం సాధ్యం కాని ప‌ని..

ప్ర‌యోగ గదుల్లో కూడా ప్ర‌పంచం నుంచి ఏదో ఒక‌టి పొందుతూనే ఉంటున్నారు క‌దా! మ‌రి! అలాంటి పొందేవాటిపై మీకు విజ్ఞ‌త లేకుంటే ఈ హ‌క్కుల కోసం పోరు దేనికి?? ఎవ‌రో ఒక‌రు నీ దేహంపై ప్ర‌క‌టించే హక్కుల‌ను నీవు ఎలా కాద‌న‌కుండా ఉంటున్నావు.. ఇవి చీము నెత్తుటి వాగుల‌ని గుర్తింప‌క ఎలా ఉంటున్నావు?. ఇలా అడుగుతూ పోతున్నానా.. అడుగులు వేస్తూ పోతున్నానో తెలియ‌దు.. చెప్పాడు ఈ దేశాన కృష్ణుడూ మ‌రియు బ‌ర్బ‌రీకుడూ ఉంటాడు అని సౌదా అంటే న‌వ్వాను.. గ‌త కాల గోల మ‌న‌కెందుకు అని చెప్పాను వాడికి విన్నాడో లేదో ఇచ్చేవాటిపై ప్రేమ ఎందుకు ఉండాలి..మ‌నుషులు కాసిన్ని బియ్యం గింజ‌లు గుంజుకుని..ప్ర‌కృతి పై ప్రేమ లేకుండా ఉంటే అప్పుడు మాత్రం ఆ నేల నిన్ను ఎందుకు క్ష‌మించాలి /రాసే ప్ర‌తి అక్ష‌రం ఉత్పాతాలు నుంచి పుట్టిన‌ప్పుడు కోటి దేవుళ్ల న‌వ్వుల‌ను ఎలా గ‌మ‌నించాలి/మీరుఏమ‌యినా ఇవ్వండి కానీ ఈ నేల‌కు ఇంత‌టి విస్ఫోట‌నాల‌ను మాత్రం కానుక‌లుగా ఇవ్వ‌కండి.. ప్లీజ్ ఇది త‌ప్పు.. ప్ర‌తీసారీ ఇలాంటి త‌ప్పులు ఎన్ని చేస్తారు?

అడ‌విలో బిడ్డ‌లు
అడ‌విలో మ‌ల్లెలు
మీ కోస‌మేనా
మీ యావ‌లో భాగంగానేనేనా
పండిన పంట‌లు ఈ పూలు ఈ వ‌నాలూ
ఇవ‌న్నీ మీ మీ చుట్టూ కొన్ని ముళ్ల‌ను సృష్టిస్తున్నాయి
చూడండి పంట‌లు చీడ‌లు మ‌నుషులు చీడ పురుగులు అన్నీ ఒక్క‌టే

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి 
పిక్ క్రెడిట్ : భాను కిర‌ణ్ టీవీ నైన్

Read more RELATED
Recommended to you

Exit mobile version