కాంగ్రెస్ హయాంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ నిర్మాణాలు జరిగాయి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

కాంగ్రెస్ హయాంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ నిర్మాణాలు జరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాంపల్లిలోని పార్టీ స్టేట్ అఫీస్ లో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కొత్తది ఏమీ కాదని అక్రమంగా చేపట్టే నిర్మాణాలను గతంలో జీహెచ్ఎంసీ కూల్చివేసేదని ఇప్పుడు దానికి పేరు మార్చి హైడ్రా పెట్టారని తెలిపారు.  హైడ్రాపై తొందరపాటు నిర్ణయాలు తగదని దుందుడుకు నిర్ణయాలు సరికావని హెచ్చరించారు.

డీపీఆర్ లేకుండా కూలగొడితే ఎలా? కూలగొట్టిన వాటికి బ్యాంక్ ఈఎంఐలు ఎవరు కట్టాలని నిలదీశారు. పేద ప్రజల ఇల్లు కూల్చమని మా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు చెప్పలేదన్నారు. హైడ్రా ఏమైనా భూతమా? అని నిలదీశారు. మూసీ పరివాహక ప్రాంతంలో 40 ఏళ్లుగా నివాసం అంటున్న వారికి ప్రభుత్వమే అన్ని వసతులు కల్పించి ఇప్పుడు కూల్చివేస్తామనడం సరికాదని మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రాంతంలో ధనవంతులు ఎవరు. ఉండరని అంతా పేదవారే ఉన్నారన్నారు.  మూనీ నిర్వాసితుల ఇండ్లను కులగొట్టడం అనేది అంత తేలిక కాదని దానికి పెద్ద సాహసమే చేయాల్సి వస్తదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version