పున్నామా నరకం నుంచి రక్షించే వాడినే కొడుకు అంటారని ఒక నానుడి ఉంది. కానీ, ఇటీవలి కాలంలో తల్లిదండ్రులు వృద్ధ్యాప్యానికి రాగానే కొందరు వారిని పట్టించుకోవడం లేదు. వారు సంపాదించిన ఆస్తిపాస్తులు తీసుకుని రోడ్డు మీద వదిలేస్తున్నారు. కొడుకు, కూతురు అనే తేడా లేదు. ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా వ్యవహరించిన ఘటనలు అనేకం వెలుగుచూస్తూనే ఉన్నాయి.
కానీ, ఓ నాలుగేళ్ల బాలుడు చేసిన పని ప్రస్తుతం అందరి చేత శభాష్ అని పించుకుంటోంది. ఆసుపత్రిలో తల్లి చేరితే తన వయసుతో సంబంధం లేకుండా బాలుడు సపర్యలు చేస్తున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగుచూసింది. అనారోగ్యంతో జ్యోతి ఆస్పత్రిలో చేరగా.. బాలుడు అన్నం తినిపిస్తూ, కాళ్లు ఒత్తుతూ సపర్యలు చేస్తున్నాడు.తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ సేవలు చేస్తున్నాడు. బాలుడిని చూసి ఆసుపత్రి సిబ్బంది, ఇతరులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.