ఇద్దరు పసికందులతో సహా ఒక తల్లి ఆత్మ హత్య చేసుకుంది. ఈ ఘటన మంగళ వారం ప్రకాశం జిల్లాలోని చిన గంజాం మండలం సోపిరాల రైల్వే గేటు వద్ద చోటు చేసుకుంది. కాగ అక్కడే ఉన్న గేట్ మ్యాన్, స్థానికుల కథనం ప్రకారం.. కుమారుడు (5), కుమార్తే (4) తో సహా ఒక తల్లి (30) మంగళ వారం మధ్యాహ్నం రైలు పట్టాల పైకి వచ్చి నిల్చొంది. దాన్ని గమనించిన గేట్ మ్యాన్, రైల్వే పోలీసులు, స్థానికలు కేకలు వేసినా.. ఆ తల్లి పట్టించుకోలేదు.
దీంతో వేగంగా వచ్చిన రైలు ఆ ముగ్గురిని ఢీ కొడుతూ వెళ్లి పోయింది. దీంతో తల్లితో సహా ఆ చిన్నారుల మృత దేహాలు చిద్రమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఘటనా స్థలం వద్ద ఎలాంటి ఆధారలు లభించలేదు. దీంతో వీరు ఏ ప్రాంతానికి చెందిన వారు అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగ మృతి చెందిన తల్లీ పేరు కూడా పోలీసులకు లభించలేదు. అయితే వీరు ప్రకాశం జిల్లాకు చెందిన వారిగానే పోలీసులు అనుమానిస్తున్నారు.