ముగ్గురు పిల్లల తల్లి, ఎనిమిదో క్లాస్ పిల్లాడితో జంప్ ?

-

ఉత్తర ప్రదేశ్‌లో 29 ఏళ్ల మహిళ 15 ఏళ్ల బాలుడితో కలిసి పారిపోయిన ఘటన సంచలనంగా మారింది. ఈ సంఘటన గోరఖ్పూర్ లో జరిగింది. బుధవారం శివరాత్రి సంబరాల నుంచి ఈ ఇద్దరూ మిస్సయ్యారు. మిస్సయిన క్రమంలో ఈ రెండు కుటుంబాలు, మహిళ అలానే బాలుడు కోసం వెతకడం ప్రారంభించారు. ఇద్దరినీ గుర్తించలేకపోయారు. అయితే బాలుడి కుటుంబం ఇప్పుడు క్యాంపియర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  అందుతున్న వివరాల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ మహిళ,  15 ఏళ్ల బాలుడికి గత ఏడాది కాలంగా సంబంధం ఉందని, అయితే వారి వయసు తేడాతో ఎవరూ వారిని అనుమానించలేదని తేలింది తెలిపింది. బాలుడి కుటుంబం చేసిన ఫిర్యాదు ఆధారంగా మహిళపై 363 మరియు 365 ఐపిసి కింద కేసు నమోదైంది. “బాలుడి కుటుంబం యొక్క ఫిర్యాదు ఆధారంగా మహిళపై కేసు నమోదైంది. మేము వారిని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాము.” అని పోలీసులు తెలిపారు. ఆ మహిళ ముగ్గురు చిన్న పిల్లల తల్లి. ఆ బాలుడి అతని పట్ల కొంతకాలంగా ఆమె ప్రవర్తన మారిందని, అయితే ఇలాంటిది జరుగుతుందని నేను ఊహించలేదని ఆమె భర్త పోలీసులకు చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version