దళితబంధును అడ్డుకున్న ఈటలను అడుగడుగున అడ్డుకోండి : మోత్కుపల్లి

-

దళిత బంధు పథకాన్ని అడ్డుకున్న ఈటల రాజేందర్‌ ను అడుగడుగునా అడ్డుకోవాలని దళిత నేతలకు మరియు సంఘాలకు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పిలుపు నిచ్చారు. ఇవాళ సీఎం కేసీఆర్‌ తో యదాద్రి క్షేత్రానికి వెళ్లారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. ఈ సందరర్భంగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ లో దళిత బంధు పథకం అమలును అడ్డుకుంది బీజేపీ పార్టీనేనని నిప్పులు చెరిగారు.

ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు ను అడ్డు కోలేరని హెచ్చరించారు. దేశమే సీఎం కేసీఆర్ బాటలో నడిచే రోజు రాబోతుందని… దళితబంధు కొత్త పథకం కాదని… దళితబంధును ఏడాది క్రితమే అమలైందన్నారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కుట్రను హుజూరాబాద్ ప్రజల గమనించాలని…ఎన్నికల పేరుతో దళితబంధును కేంద్రం నిలిపివేయడం సరైంది కాదని మండిపడ్డారు. కులరహిత సమాజం, ఆర్థిక ఇబ్బందులు లేని సమాజం కోసం పరితపించే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు మోత్కుపల్లి నర్సింహులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version