స్మార్ట్ ఫోన్ దిగ్గజం.. మోటరోలా నుంచి జీ సిరిస్‌లో భాగంగా ఇప్పటికే కొన్ని ఫోన్లు పట్టాలెక్కేశాయి.. ఇప్పుడు అదే వరుసలో మోటో G62 కూడా ఉంది. మోటరోలా కంపెనీ ఈ బడ్జెట్ 5G ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకుచ్చేపనిలో ఉందని సమాచారం. ఇటీవల బ్రెజిల్‌లో Moto G62 ఫోన్ లాంచ్ చేసింది ఈ ఫ్లాగ్ షిప్ 5G ఫోన్ పై మరన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
బ్రెజిల్‌లో లాంచ్ అయిన Moto G62 ఫీచర్స్..
120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వచ్చింది.
ఇందులో LCD ప్యానెల్ మాత్రమే ఉంది. హుడ్ కింద బడ్జెట్ ఫోన్లలో అమర్చే Qualcomm Snapdragon 480+ SoC ఉంది.
అంతేకాదు 5G సపోర్టు కూడా ఉంది.
20W టర్బో ఛార్జింగ్ టెక్‌కు సపోర్టుతో హుడ్ కింద 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్‌తో కంపెనీ స్టీరియో స్పీకర్‌లను అమర్చారు.
ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది.
50-MP ప్రైమరీ కెమెరా, 8-MP అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్ 2-MP సెన్సార్ ఉన్నాయి.
ముందు భాగంలో సెల్ఫీలను తీయడానికి 16-MP కెమెరా ఉందని నివేదికలు చెబుతున్నాయి.
Motorola నుంచి Snapdragon 8+ Gen 1 సామర్థ్యంతో ఈ డివైజ్ ఇండియాలో ఎంట్రీ ఇవ్వనుంది. భారత మార్కెట్లో లాంచ్ కానున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇదే కాదు. OnePlus 10T జూన్ చివరి నాటికి భారతీయ మార్కెట్లోకి రానుందని రుమర్లు వినిపిస్తున్నాయి. Xiaomi టాప్-ఎండ్ Xiaomi 12 అల్ట్రా ఫోన్‌ను జూలై 4న లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది. భారత్ మార్కెట్లో ఈ ఫోన్ లాంచ్ ఉంటుందా లేదా అనేది ఇంకా రివీల్ చేయలేదు. షావోమీ మొదటి అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. దాంతో షావోమీ 12 ఫోన్ కూడా ఇండియాలో లాంచ్ అవుతుందని అంచనా… అలాగే Apple iPhone 14 సిరీస్ కూడా ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.