MOVIE RESULT: పసలేని నిఖిల్ “SPY” మూవీ…

-

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ ఎన్నో అంచనాలతో స్పై మూవీతో ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొత్తం 1106 థియేటర్ లలో ఈ సినిమాకు మేకర్స్ రిలీజ్ చేయడం విశేషం. ఇందులో సిద్దార్ధ్ కు జోడీగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా చేయగా… గ్యారీ దర్శకత్వ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. అయితే ఇప్పటికే సినిమా ఫలితం ఏమిటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా ప్లాట్ ను బలంగా ప్లాన్ చేసుకున్న దర్శకుడు గ్యారీ సినిమా మొత్తం అదే టెంపో ను మైంటైన్ చేయడంలో ఫెయిల్ అయ్యాడని తెలుస్తోంది. నేతాజీ శుభాష్ చంద్రబోస్ అదృశ్యం అయిన సీన్ ను ప్రధానముగా చేసుకుని దీనిని ఇన్వెస్టిగేట్ చేసే రోల్ ను సిద్దార్ధ్ పోషించాడు. అయితే ఇలాంటి సినిమాలలో ఎక్కువగా స్క్రీన్ ప్లే ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ ఈ విషయంలోనే దర్శకుడు పూర్తిగా తేలిపోయాడని సినిమా వర్గాలు తెలిపాయి. ఇక రా ఏజెంట్ ను ఎంతగా ప్రెజెంట్ చెయ్యాలి అనే విషయంలోనూ తప్పులు జరిగాయి. మొత్తానికి స్పై మూవీ పసలేదని టాక్ బయటకు వచ్చేసింది.

కార్తికేయ 2 మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టిన సిద్దార్ధ్ కు ఈ మూవీతో ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే అందుకులేం అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఆదిపురుష్ కు నిరాశానజనకమైన ఫలితం రావడంతో ఇది సాధ్యం అవుతుంది. మరి కలెక్షన్ లు ఏ మేరకు రానున్నాయి అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version