నేడు ఓటీటీల్లో రీలిజ్ అయ్యే మూవీస్ ఇవే..

-

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌చ్చిన త‌ర్వాత ఓటీటీ ట్రెండ్ మొద‌లైంది. సినిమాలు థీయేట‌ర్ లల్లో విడుద‌ల అయినా.. ఓటీటీల్లో చూడ‌టానికే ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. ఏ సినిమా విడుద‌ల అయినా… 4 నుంచి 5 వారాల్లో ఏదో ఒక్క ఓటీటీ లోకి రావాల్సిందే. దీంతో ప్రేక్షకులు.. థీయేట‌ర్ క‌న్నా.. ఓటీటీలు అంట‌నే ఎక్కువ మ‌క్కువ చూపుతున్నారు.

దాదాపు చాలా మంది ఒక్క‌టి కంటే.. ఎక్కువ ఓటీటీల‌ను స‌బ్‌స్క్రీప్షన్ చేసుకున్నార‌ని ఒక స‌ర్వే కూడా తేలిపింది. దీంతో ఓటీటీలో వ‌చ్చే సినిమాల‌కు డిమాండ్ భారీగా పెరిగింది. ఇదిల ఉండ‌గా.. ఈ రోజు ఓటీటీల్లో అదిరిపోయే సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి. అవి ఏంటో చూద్దం.

మొద‌టి చిత్రం జెమ్స్.. క‌న్నడ ప‌వ‌ర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ నటించిన చివ‌రి చిత్రం. ఈ సినిమా థీయేట‌ర్ ల‌లో మార్చి 17 విడుద‌ల అయి.. సంచ‌ల‌నాలు సృష్టించింది. ఈ విడుద‌ల అయిన నాలుగు రోజుల్లో రూ. 100 కోట్లను వ‌సూల్ చేసింది. రూ. 5ం కోట్లతో తీసిన జెమ్స్ సినిమా.. 13 రోజుల్లోనే రూ. 150 కోట్ల‌కు పైగా క‌లెక్షన్లు చేసింది. కాగ ఈ సినిమా సోనీ లివ్ లో నేటి నుంచి స్ట్రీమింగ్ కానుంది.

మ‌రో సినిమా ఆడ‌వాళ్లు మీకు జోహ‌ర్లు.. మార్చి 4న థీయేట‌ర్ ల‌లో విడుద‌ల అయిన ఈ సినిమా.. ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. శ‌ర్వ‌నంద్, రష్మిక మంద‌న్న జంటగా న‌టించిన ఈ సినిమాను త‌రుమ‌ల కిషోర్ తెర‌కెక్కించారు. ఖుష్బుతో పాటు రాధిక శ‌ర‌త్ కుమార్, ఊర్వ‌శి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా కూడా సోనీ లీవ్ లోనే ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది.

వీటితో పాటు సాయి కుమార్, రాధిక శ‌ర‌త్ కుమార్ న‌టించిన గాలి వాన అనే వెబ్ సిరీస్ కూడా నేటి నుంచి జీ5 లో అందుబాటులోకి రానుంది. అలాగే రామ్ గోపాల్ వ‌ర్మ ద‌హ‌నం అనే వెబ్ సిరీస్ కూడా నేటి నుంచి ఎంఎస్ ప్లేయ‌ర్ లో స్ట్రీమింగ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version