కేసీఆర్ కు ఎంత తొందరగా.. గత్తర వస్తే తెలంగాణకు అంత మంచిదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు ధర్మపురి అర్వింద్. కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా సర్వ నాశనం అయ్యిందని.. ప్రాథమిక విద్య నుంచి విశ్వ విద్యాలయాల వరకు భ్రష్టు పట్టించారని ఆగ్రహించారు. రాహుల్ గాంధీ, కేసీఆర్ ములాఖత్ అయ్యారా? తెలంగాణ విశ్వవిద్యాలయం పరిస్థితి మరింత అద్వాన్నంగా ఉందని విమర్శించారు.
కేటీఆర్ దావోస్ పర్యటనకు వెళ్ళితే 13కోట్ల 22లక్షలు ఖర్చు అయ్యిందని.. కేటీఆర్ పర్యటనకు డబ్బులు ఇస్తారు కానీ విద్యార్థుల మౌలిక సదుపాయాల కల్పనకు ఇవ్వరా? అని నిలదీశారు. కేసీఆర్ మనుమడు, పేదోడి పిల్లలు ఒకే స్కూల్లో చదువుతున్నారా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని.. కేసీఆర్ కు ఎంత తొందరగా గత్తర వస్తే తెలంగాణకు అంత మంచిదని తెలిపారు. తెలంగాణను దోచుకుతిన్నరు… ఇక భారత దేశాన్ని దోచుకుతిందామని చూస్తున్నారని ఆగ్రహించారు. ఈడీ అడిగే ప్రశ్నలకు రాహుల్ గాంధీ మౌనం పాటించి.. గంటల కొద్దీ సమయం తీసుకుంటున్నారని.. కేసీఆర్ సర్కారు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ధర్నా చేయనిస్తుందో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.