హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రికి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సందర్శించారు. కరోనా చికిత్సలపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారు. 3 మెడికల్ ఆస్పత్రులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. వాటి కంటే ముందు ఉస్మానియా ఆస్పత్రిని బాగు చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితిలో వైద్యులు మానవత్వంతో పనిచేస్తున్నారని తెలిపారు. కానీ ఉస్మానియాలో తగినన్ని సౌకర్యాలు లేవని మండిపడ్డారు. రోగుల తాకిడి నేపథ్యంలో ఉస్మానియాలో కొత్త ఎమర్జెన్సీ బిల్డింగ్‌ను నిర్మించాలన్నారు. పాత బిల్డింగ్‌లో 6 వందల బెడ్స్ ఉండేన్నారు. బిల్డింగ్ క్లోజ్ చెయ్యడంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
వెయ్యి కోట్లు విడుదల చేయ్.. కేసీఆర్‌పై స్వరం పెంచిన అసదుద్దీన్ ఒవైసీ
-