ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. బీజేపీ పార్టీలో నేరెడ్ మేట్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి, ఆకారం సాయి తదితరులు జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఏ పార్టీలో అయినా జాతీయ అధ్యక్షుడు దగ్గరనుండి గ్రామస్థాయి కార్యకర్త వరకు ఈ పార్టీ నాది అనే భావన లేకపోతే ఆ పార్టీ బ్రతకదు. ప్రతి ఒక్కరూ ఓనర్లె. బీజేపీలో కూడా ప్రతి ఒక్కరూ ఓనర్ లెక్కనే ఉంటారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహిస్తున్న పార్టీ బీజేపీ.
దేశానికి దిక్సూచి మోడీ తప్ప ఎవరు కనిపించడం లేదు అని సీనియర్ BRS, కాంగ్రెస్ నాయకులు ఈరోజు నాతో అన్నారు. ఆ మాటలు విని నేను గర్వపడ్డా. మహాభారతంలో సంజయుడికి మాత్రమే ఎక్కడ ఏం జరుగుతుందో చూసే శక్తి ఉండేది.. ఆయనే ధృతరాష్ట్రునికి యుద్ధంలో ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్లు చెప్పేవాడు. కానీ ఈనాడు సెల్ ఫోన్ ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రతి సామాన్యుడు తెలుసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ సంజయుడే. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి అధికారం ఇచ్చాం కానీ ఇంకా శక్తివంతం చేయాల్సిఉండే అనే అభిప్రాయం పార్లమెంటులో జరిగే పరిణామాలు చూసి అనుకుంటున్నారు. ఎక్కడో తప్పు జరిగింది.. ఆ శక్తి ఇచ్చి ఉంటే భారత్ ఇంకా సుభిక్షంగా ఉండేదని భావిస్తున్నారు. అందుకే ఏ ఎన్నిక జరిగినా బీజేపీకే పట్టం కడుతున్నారు. తెలంగాణ లో హైదారాబాద్ చుట్టు గెలిచిన పార్టీ మనది. GHMC ఎన్నికల్లో వికసించేది కూడా బీజేపీనే. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీకి 40 శాతం ఓట్లు వస్తే బిజెపికి 35% ఓట్లు వచ్చాయి. ఇక భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే అని ఈటల పేర్కొన్నారు.