బీజేపీ బుల్డోజర్లతో ప్రాంతీయ పార్టీలకు భయం పట్టుకుంది: ఎంపీ జీవీఎల్

-

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు బీజేపీ అంటే భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు ఎంపీ జీవీఎల్. బీజేపీ బుల్డోజర్లు తెలుగు రాష్ట్రాలకు వస్తున్నాయని కొంతమంది నేతలు కంగారు పడుతున్నారని విమర్శించారు. తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని కొంతమంది నాయకులు భయపడుతున్నారని విమర్శించారు. కేంద్రం తెలుగు రాష్ట్రాలకు సహాయసహకారాలు అందిస్తున్నా… విమర్శిస్తున్నారని, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర సహాయం ప్రజలకు తెలియకూడదనే దురుద్దేశంతో కేంద్ర పథకాలకు స్టిక్కర్లు వేసుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన సాయాన్ని తక్కువచేసి తెలంగాణలో, ఏపీలో కొంతమంది మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. సబ్సిడీ ఇచ్చిన బియ్యం పథకానికి మీ నేతల ఫోటోలు ఎలా పెడుతారని సీఎం జగన్ ను డిమాండ్ చేశారు. పీకే కాంగ్రెస్ గూటికి వెళితే.. టీఆర్ఎస్, వైసీపీలు కాంగ్రెస్ తో కలుస్తాయా..? అని ప్రశ్నించారు. ప్రధానిమోదీపై కొంతమంది హద్దు మీరి వ్యాఖ్యలు చేస్తున్నారని… మంత్రి కేటీఆర్ హద్దుమీరి మాట్లాడుతున్నారని.. ఇది వారిలో భయం కనబడుతుందని జీవీఎల్ అన్నారు. అనవసరంగా దూషిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీపై విమర్శలు చేసేవారిని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version