రాజధాని అంశంపై జీవిఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు..?

-

జగన్ సర్కారు తలపెట్టిన 3 రాజధానిల రగడ మరోసారి రాజుకున్న విషయం తెలిసిందే. ఏపీ గవర్నర్ 3 రాజధాని లకు సంబంధించిన బిల్లుకు ఆమోదముద్ర వేయడంతో… ఒక్కసారిగా వికేంద్రీకరణ అంశం రాజుకుంది. ఇక ఏపీలోని ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య వికేంద్రీకరణ కు సంబంధించి తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిపక్ష టీడీపీ అధికార వైసీపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.

అయితే తాజాగా దీనిపై బిజెపి ఎంపీ జీవీఎల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశం కేంద్రం పరిధిలోది కాదు అంటూ మరోసారి స్పష్టం చేసిన జీవీఎల్… కొంతమంది నేతలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి వ్యతిరేకంగా చెబుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది కావాలనే బిజెపిపై దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు బిజెపి ఎంపీ జీవీఎల్. కాగా ఇప్పటికే రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version