ఏపీలో భాజపా ఎంపీ కారు ఢీకొని మహిళ మృతి

-

భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చిక్కుల్లో పడ్డారు. ఆయన  ప్రయాణిస్తున్న కారు ( ఏపీ 16 సీఎస్ 1616 ) ఢీకొని ఒక మహిళ మృతి చెందగా, మరో  మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లా కొలనుకొండ వద్ద  రోడ్డు దాటుతున్న మహిళలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రగాయాలైన మహిళను ఆసుపత్రికి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో జీవీఎల్ కారులోనే ఉన్నారు. ప్రమాదం తర్వాత ఆయన మరో కారులో విజయవాడకు వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేశారు.  కారు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version