ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ను కలిసేందుకు వెళ్లిన ఎంపీ రేవంత్ రెడ్డి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. జోనల్ కమిషనర్ లేకపోవడంతో డీసీ మారుతి ని కలిసి వరద ముంపు ప్రాంతాల వివరాలు రేవంత్ రెడ్డి ఇచ్చారు. వరద ముంపు సహాయం లో అవకతవకల పై జోనల్ కమిషనర్ ను ఫోన్ లో రేవంత్ మందలించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన లబ్ధిదారుల వివరాలు, ఎంపిక చేసిన అధికారుల వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.
ఒక ఎంపీగా తనకు సాయం పంపిణీ సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. అవకతవకలపై ఏసిబి, విజిలెన్స్, సివిసి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసారు. లేదంటే అధికారుల పై కోర్టులో పిటిషన్ వేస్తానని జోనల్ కమిషనర్ ను రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సహాయం అధికారులే చేయాలని… పార్టీ కార్యకర్తలు పంపిణీ చేస్తే మహిళలు తిరగబడి కొడతారని ఆయన అన్నారు.