బీజేపీ ఎంపీ పై చర్యలు తీసుకోవాలి : ఎంపీ షఫీకర్

-

ఇటీవల బీఎస్పీ ఎంపీగా ఉన్న డానిష్ అలీ పై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి పార్లమెంట్ వేదికగా చేసిన ఉగ్రవాద పూరిత వ్యాఖ్యల గురించి తెలిసిందే. ఆ పార్టీ నేతలు మాత్రమే ఈ వ్యాఖ్యల పట్ల వ్యతిరేకత తెలియచేశారు. ఇక తాజాగా సమాజ్ వాదీ పార్టీ ఎంపీ షఫికర్ రెహమాన్ ఈ విషయంపై స్పందించారు. షఫికర్ రెహమాన్ మాట్లాడుతూ, బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదంటూ ఖండించారు. అనంతరం ఈయన మాట్లాడుతూ ముస్లిం లు కూడా దేశంలో ఒక భాగమే అంటూ గుర్తు చేశారు. ముస్లిం ప్రజలు కూడా దేశం యొక్క సంక్షేమం మరియు అభివృద్ధి గురించి ఆలోచిస్తారని షఫీకర్ చెప్పారు. ఉద్దేశ పూర్వకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి పై తగిన చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం అంటూ షఫీకార్ డిమాండ్ చేశారు.

కాగా రమేష్ బిధూరి పై చర్యలు తీసుకుంటారా ? షఫీకర్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటారా ? ఇక లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మరోసారి ఇలా జరిగితే కఠిన చర్యలు ఉంటాయని మందలించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version