ఆస్కార్ రెడ్ కార్పెట్ పై బిడ్డతో సహా సందడి చేసిన మిస్టర్ సీ..!

-

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో 95వ ఆస్కార్ ప్రధానోత్సవం మార్చి 12న అమెరికా టైం లైన్ ప్రకారం చాలా అట్టహాసంగా జరిగినట్లు.. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇండియన్ టైం ప్రకారం ఈరోజు ఉదయం ఐదున్నర గంటల నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ రెడ్ కార్పెట్ పై సందడి చేస్తున్న మన తెలుగు తారలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ముఖ్యంగా రామ్ చరణ్ అదిరిపోయే మోడ్రన్ లుక్ లో కనిపించడమే కాదు .. తన భార్య కడుపులో మోస్తున్న బిడ్డతో సహా రెడ్ కార్పెట్ పై నడిచి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా అక్కడ మీడియా ప్రతినిధులతో ఉపాసన మాట్లాడుతూ .. ఆర్ఆర్ఆర్ టీం లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకరకంగా చెప్పాలి అంటే నర్వస్ గా ఫీల్ అవుతున్నాను. టెన్షన్ కూడా వస్తోంది.. ఆర్ ఆర్ ఆర్ ఫ్యామిలీలో భాగం కావడం నిజంగా నేను, నా బిడ్డ చేసుకున్న అదృష్టం అని చెప్పగానే.. వెంటనే రామ్ చరణ్ మైక్ అందుకొని ఉపాసన చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్..

అందులోనూ తాను ఆరు నెలల ప్రెగ్నెంట్.. అని చెప్పగానే అక్కడున్న మీడియా ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయి ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ రెడ్ కార్పెట్ పై తాను, తన భార్య అలాగే కడుపులో ఉన్న బిడ్డతో ఇలా ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడవడం మాకు చాలా గర్వంగా ఉంది. మాతో పాటు మా బిడ్డ పుట్టకముందే అదృష్టం చేసుకున్నారు అంటూ రాంచరణ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version