ఆ తపనే ఆమెను రూ. వెయ్యి కోట్లకు చేర్చింది..!

-

తన ఇంటి ఆవరణలో ఓ చిన్న బెకరీతో వ్యాపారాన్ని పారంభించి ప్రస్తుతం రూ. 1000 కోట్ల టర్నోవర్‌గా కంపెనీగా అవతరించింది. బిస్కెట్‌ తయారీ రంగంలో పేరుగాంచిన ‘మిసెస్‌ బెక్టార్‌–క్రీమికా’ సంస్థ. విదేశీ బ్రాండ్లను తట్టుకొని మార్కెట్‌ రంగంలో తనదైన శైలిలో ముద్ర వేసుకుంది. ఈ ఘనతంతా ఓ మహిళకే దక్కుతుంది. ఆమెనే ‘మిసెస్‌ బెక్టార్‌’ ఫుడ సంస్థ అధినేత్రి రజనీ బెక్టార్‌.బాల్యమంతా లాహోర్‌లో గడిపిన ఆమె విభజన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లిలో స్థిరపడ్డారు. లూధియానా చెందిన ధర్మవీర్‌ బెక్టార్‌తో 17 ఏళ్లకే పెళ్లి జరిగింది. ఆ తర్వాత భర్త పోత్సహంతో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం పిల్లల పెంపకంతో నిమగ్నమయ్యారు.

కొత్తగా చేయాలని..

చిన్నప్పుటి నుంచే రజనీకి ఏదో ఒకటి కొత్తగా చేయాలనే ఆలోచన బలంగా ఉండేది. పిల్లలను స్కూల్లో చేర్పించడంతో ఆమె ఒంటరిగా ఉండేది. ఈ ఖాళీ సమయంలో ఏదైనా చేయాలని తపనతో కుక్కింగ్‌ అండ్‌ బేకరీ కోర్సులో చేరారు. ఇంట్లో అప్పుడప్పుడు కోర్సుల్లో చేర్చుకున్న అనుభవంతో బిస్కెట్లు, ఐస్‌క్రీమ్‌లు తయారు చేసి కుటుంబ సభ్యులు, స్నేహితులకు తినిపించేవారు. వాటి రుచి చూసిన వారు ఆమెను అతి తక్కువ సమయంలో అద్భుతమైన రుచికర పదర్థాలు తయారు చేశారని అభినందిస్తూ, ప్రోత్సహించేవారు.

వారి పోత్సహంతోనే..

భర్త, స్నేహితులు, బంధువలు పోత్సహంతో ఓవెన్, ఐస్‌క్రీమ్‌ తయారీ మెషిన్‌ కొనుగోలు చేసి తన ఇంటి ఆవరణలో వ్యాపారాన్ని ప్రారంభించింది. అలా భర్త పోత్సహంతో 1978లో రూ. 20 వేలతో లూథియానాలో ‘క్రీమికా’ అనే పేరుతో ఓ ఐస్‌క్రీమ్‌ మినీ యూనిట్‌ ప్రారంభించారు. ఆ తర్వాత రజనీ నష్టాల వైపు చూడలేదు. మెల్లిమెల్లిగా బిస్కెట్లు, సాస్, బన్ల వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. అతి తక్కువ కాలంలోనే మిసెస్‌ బెక్టార్‌ బ్రండ్‌తో ఉత్తర భారత్‌లోని ఆహార విపణిలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version