ముద్ర‌గ‌డ ఆ పార్టీలోకి వెళుతున్నారా..?

-

కాపు రిజ‌ర్వేష‌న్ల నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇప్పుడు జ‌న‌సేన వైపు చూస్తున్నారా.. అంటే నిజ‌మే అనే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. ముద్ర‌గడ ప‌ద్మ‌నాభం, జ‌న‌సేన నేత జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ల భేటీ కావ‌డంతో ఇప్పుడు ఈ వార్త‌లు నిజ‌మేన‌ని అనిపిస్తున్నాయి. ఏపీలో రాజ‌కీయాలు గ‌తం నుంచి వ‌ల‌స‌తోనే సాగుతున్నాయి. ఎన్నిక‌లు మొద‌ల‌యిన్ప‌టి నుంచి ఇప్ప‌టిదాకా ఓ పార్టీ లో నుంచి మ‌రో పార్టీలోకి జంప్ కావ‌డం కొన‌సాగుతూనే ఉంది. అధికారంలో ఉన్న వైసీపీ వైపు కొంద‌రు, వైసీపీలో స్థానం లేని వారు బీజేపీ వైపు దృష్టిసారిస్తున్నారు నేతలు.

ప్ర‌ధానంగా టీడీపీ, జ‌న‌సేన నుంచి ఈ వ‌ల‌స‌లు ప్ర‌ధానంగా సాగుతుండ‌గా ఆశ్చ‌ర్య క‌రంగా జ‌న‌సేన వైపు కాపు నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం చూపు చూస్తున్నార‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ స్వ‌యంగా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇంటికి వెళ్ళ‌డం, దానికి ముద్ర‌గ‌డ జేడీని సాధారంగా ఆహ్వ‌నించ‌డం, అక్క‌డే ఇద్ద‌రు క‌లిసి అల్పాహ‌రం చేయ‌డం, జేడీకి ముద్ర‌గ‌డ స్వ‌యంగా కొసిరి కొసిరి వ‌డ్డించ‌డం ప‌ట్ల ఇద్ద‌రి మ‌ధ్య గంట‌కు పైగా రాజ‌కీయ చ‌ర్చ‌లు జ‌రిగిన నేప‌థ్యంలో జ‌న‌సేన‌లోకి ముద్ర‌గ‌డ వెళ‌తార‌నే అనుకుంటున్నారు. అయితే ముద్ర‌గ‌డ ఇప్పుడు జ‌న‌సేన‌లో చేరిచేసేది ఏమి లేనందున ఈ భేటీ కేవ‌లం మ‌ర్యాద పూర్వ‌కంగానే జ‌రిగి ఉంటుంద‌నే టాక్ వినిపిస్తుంది.

Mudragada Padmanabham

ముద్ర‌గ‌డ జ‌న‌సేన‌లో చేరాల‌నుకుంటే ఎన్నిక‌లకు ముందే చేరేవారు. కానీ ఇప్పుడు అధికారం లేని పార్టీలో చేరితే కాపు ప్ర‌జ‌ల‌కు ఓరిగేదేమిటి అనే సందేహం క‌లుగ‌క‌మాన‌దు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ దూత‌గానే జేడీ వివి ల‌క్ష్మీనారాయ‌ణ ముద్ర‌గ‌డ‌ను క‌లిసార‌ని అర్థమ‌వుతుంది. అయితే కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై ఏపీ సీఎం జ‌గ‌న్‌ ఎన్నిక‌ల ముందు కూడా ఎలాంటి హామి ఇవ్వ‌లేదు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా ముద్ర‌గ‌డ సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాసారు. కానీ దీనిపై ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌డంతో ముద్ర‌గ‌డ త్వ‌ర‌లో ఓ పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని మీడియా స‌మావేశంలోనే వెల్ల‌డించారు.

అంటే కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం జ‌న‌సేన‌లో క‌లిసి పోరాటం చేస్తారా.. లేక బీజేపీలో చేరి పోతారా అనేది ఇతిమిద్దంగా తేల‌లేదు. అయితే ఇప్పుడు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ముద్ర‌గ‌డ ఇంటికి వెళ్ళ‌డం అంటే జ‌న‌సేన‌లో చేరేందుకే ఆయ‌న‌ను ఆహ్వ‌నించారా అనే అనుమానాలు రాక‌మాన‌వు. ఏదేమైనా ఇప్పుడు ముద్ర‌గ‌డ కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం జ‌న‌సేన‌లో క‌లిస్తే అది సాధ్య‌మ‌వుతుందా అనేది సందేహమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version