ముహూర్తం లేకుండా ఏ పని అయినా మొదలు పెట్టొచ్చు ఏమో గానీ పెళ్లి మాత్రం చేయకూడదు. రెండు జీవితాలు రెండు కుటుంబాలకు సంభందించిన విషయం కాబట్టి ఆచి తూచి పెళ్లిని జరిపిస్తారు. సరైన ముహూర్తం చూసుకున్న తరవాతే మూడు ముళ్లు వేయిస్తారు. ఇక ప్రస్తుత మార్గశిర మాసం దాటితే పుష్యం లో పెళ్లిళ్లు చేసుకోవడం కుదరదు. కాబట్టి ఈ నెల 29 వరకే మంచి ముహూర్తాలు ఉండటం తో చక చకా వివాహాలు కానిస్తున్నారు.
పట్టింపులు, కట్నాల విషయం పక్కన పెట్టి ముందు అయితే పెళ్లి చేసి ఆ తరవాత వాటి సంగతి చూసుకుందాం అని భావిస్తున్నారు. ఇక ఒకేసారి పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతూ ఉండటం తో కళ్యాణ మండపాలు దొరకడం కూడా కష్టం గా మారింది. దాంతో కొంతమంది గుళ్ళల్లో వివాహాలు జరిపిస్తున్నారు. అంతే కాకుండా మరోవైపు ఒమిక్రాన్ ముప్పు కూడా పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. దాంతో ఎక్కడ లాక్ డౌన్ వస్తుందో పెళ్లి వాయిదా పడుతుందో అని కూడా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఆంక్షలు రాకముందే పెళ్లి జరిపిస్తున్నారు.