మిజోరాం: అస్సాం, మిజోరాం మధ్య బోర్డర్ వార్ కొనసాగుతూనే ఉంది. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులో తలెత్తిన వివాదంతో మిజోరాంకు చెందిన పోలీసులు మృతి చెందారు. దీంతో మిజోరం ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తమ రాష్ట్ర పోలీసుల మృతి కారకులపై చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు అస్సాం సీఎం బిశ్వ శర్మతో పాటు ఆరుగురు ఉన్నాతాధికారులపై కేసులు నమోదు చేసింది. కొలసిస్ జిల్లా వైరంటేగ్ పోలీస్ స్థేషన్ పరిధిలో గతవారం అస్సాం, మిజోరాం పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు బాధ్యులుగా అస్సా డీజీపీ అగర్వాల్, డీఐజీ దేవజ్యోత్ ముఖర్జీ, కాచర్ ఎస్సై చంద్రకాంత్, ధోలియా పోలీస్ స్టేషన్ ఇంఛార్జీ సాహెబ్ ఉదిన్‌పై వైరంటేగ్ పోలీస్ స్టేషన్‌లో అస్సా సీఎంపై పోలీసు కేసులు దాఖలు చేశారు. ఐపీసీ 320,120-బీ, 270,352, 326, 353, 336, 348, 334 సెక్షన్ల కింది కేసులు నమోదు చేశారు. వీరిందరికి సమన్లు జరీ చేశారు. ఆగస్టు 1న తమ ఎదుట హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు.