హైదరాబాద్ లోని చాదర్ ఘాట్, మూసారంబాగ్ వంతెనలకు వరద ముప్పు పొంచి ఉంది. మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా వరద ఈ బ్రిడ్జిలను తాకే అవకాశం ఉంది. దీంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్య వేక్షిస్తున్నారు. అర్ధరాత్రి వరకు వరద ఉద్ధృతి పెరిగితే బ్రిడ్జ్లపై నుంచి రాకపోకలు నిలిపివేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. అటు ఇప్పటికే మూసీ పరీవాహక ప్రాంతాలను ప్రజలను GHMC అప్రమత్తం చేసింది.
అయితే.. ఎగువ నుంచి వరద ఉధృతి పెరగడంతో సూర్యాపేట మండ లం జిల్లా సరిహద్దులోని మూసీ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లను అధికారులు ఎత్తారు. గురువారం రాత్రి వరకు 3, 4 గేట్ల ద్వారా నీటి విడుదల చేయగా, నిన్న ఉదయం మరో రెండు గేట్లు 2 ఫీట్ల మేర ఎత్తి 5205 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 4,861 క్కూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. వరద ఇలాగే కొనసాగితే మరిన్ని గేట్లను ఎత్తే అవకాశం ఉందని, మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు డీఈ చంద్రశేఖర్ తెలిపారు. మూసీ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదలను చూసేందుకు సందరక్శుల తాకిడి పెరిగింది.