ఎమ్మెల్యే మేనల్లుడి తలకి 51 లక్షల రివార్డ్ ప్రకటించిన యూపీ నేత

-

బెంగళూరులో మొన్న జరిగిన అల్లర్లు గుర్తున్నాయి కదా, ఈ అల్లర్లలో దాదాపు అరవై మంది దాకా గాయపడగా ముగ్గురు మరణించారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి మేనల్లుడు నవీన్ ముస్లిం ప్రవక్త గురించి తప్పుగా ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. ఇదే మొత్తం అల్లర్లకు కారణం అయ్యింది. ఈ విషయం మీద ఎమ్మెల్యే ఇంటి మీదకి దండెత్తినట్టుగా చాలా మంది ముస్లింలు అర్ధరాత్రి సమయంలో వెళ్లారు.

అంతే కాక ఎమ్మెల్యే ఇంటిని తగలపెట్టే ప్రయత్నం కూడా చేశారు. దీంతో ఈ వ్యవహారం బాగా హైలైట్ అయింది. అప్పటికప్పుడు పోలీసులు అక్కడికి చేరుకున్నా వీరిని కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ముగ్గురు మరణించారు కూడా. అయితే తమ ప్రవక్త గురించి తప్పుగా పోస్ట్ చేసిన ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి మేనల్లుడు నవీన్ తలకి 51 లక్షల రివార్డ్ ప్రకటించారు ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ కి చెందిన ఒక ముస్లిం నేత. అయితే ఈ ప్రకటన విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండడంతో పోలీసులు అతని మీద చర్య తీసుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version