దద్దరిల్లిన హైదరాబాద్, మున్సిపల్ ఎన్నికలకు ముందు బిజెపికి భారీ షాక్….!

-

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరపట్టికకు వ్యతిరేకంగా శనివారం  మధ్యాహ్నం హైదరాబాద్ లో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. హైదరాబాద్ ఎంపీ, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పిలుపు ఇచ్చిన నేపధ్యంలో… సుమారు 25 వేల మందికి పైగా ముస్లింలు ఈ ర్యాలీలో పాల్గొన్నారని సమాచారం. ఈ భారీ ర్యాలీతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

ట్యాంక్‌బండ్‌కు వెళ్ళే రహదారులపై గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్ లో ఆగిపోయాయి. జాతీయ జెండాలు చేతబూని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముస్లింలు ర్యాలీలు నిర్వహించారు. అదే విధంగా నగరంలోని పలు ప్రాంతాల్లో బైక్ ర్యాలీలు చేస్తూ హిందూస్థాన్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గాంధి నెహ్రూ కల్పించిన స్వాతంత్య్రం, అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగం కావాలని కోరిన వాళ్ళు,

ఎన్‌ఆర్‌సీ లాంటి ప్రజా వ్యతిరేక చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయనిచ్చేది ఈ సందర్భంగా స్పష్టం చేసారు. అటు కాంగ్రెస్ కూడా ఈ ర్యాలీకి మద్దతు ఇచ్చింది. పలువురు కాంగ్రెస్ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి, ఇటు లిబర్టీ నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్దమవుతున్న భారతీయ జనతా పార్టీకి ఇది ఒకరకంగా ఇబ్బందికర వార్తే.

తెలంగాణా ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెలిచిన ఆ పార్టీ ఆ తర్వాత ఎక్కడా ప్రభావం చూపించలేదు. ముస్లింలు ఎక్కువగా ఉండే హైదరాబాద్ నగరంలో జరిగిన ఈ ర్యాలీకి బిజెపికి పట్టున్న జిల్లాల నుంచి కూడా ముస్లింలు తరలి వచ్చారు. దీనితో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఎన్నార్సిని వ్యతిరేకించిన తెరాస పార్టీ మాత్రం ఈ ర్యాలీలో పాల్గొనలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version