జస్ప్రిత్ భూమ్రా” టీం ఇండియా పేస్ కెప్టెన్. అతను జట్టులో ఉంటే చాలు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మ్యాచ్ టీం ఇండియా వైపు మొగ్గే అవకాశ౦ ఉంటుంది. అద్భుతమైన బౌలింగ్ తో టీంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న ఈ పేస్ గన్, అంతర్జాతీయ క్రికెట్ లో చాలా మంది అగ్ర శ్రేణి ఆటగాళ్లకు ఇప్పటికి కంటి మీద కునుకు లేకుండా చేయడం విశేషం.
తన యార్కర్లతో బ్యాట్స్‌మెన్ ని తికమక పెడుతూ చుక్కలు చూపిస్తున్నాడు. యార్కర్లలో, లైన్ అండ్ లెంగ్త్‌లో అద్భుతమైన ఫామ్ తో ఈ యువ పేసర్ దూసుకుపోతున్నాడు. జట్టులోకి వచ్చిన కొంత కాలానికే నెంబర్ 1 బౌలర్ గా మారిపోయాడు భూమ్రా. అయితే కొంత కాలంగా భూమ్రా గాయం కారణంగా జట్టుకి దూరంగా ఉన్నాడు. దాదాపు మూడు నెలల నుంచి భూమ్రా గాయంతో బాధపడుతున్నాడు.
అయితే ఆదివార౦ గౌహతి వేదికగా శ్రిలంకతో జరిగే మ్యాచ్ కి భూమ్రా అందుబాటులోకి రానున్నాడు. ఈ నేపధ్యంలో అతను రీ ఎంట్రీ వీడియోని బిసిసిఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అతడి ప్రాక్టీస్ వీడియోను ‘‘బుమ్రా ఫామ్ ఎలా ఉందని’’ బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో ఫాన్స్ ని ప్రశ్నించింది. బుమ్రా వేగవంతమైన యార్కర్‌తో వికెట్లను ఎగరగోట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Missed this sight anyone? ???
How's that from @Jaspritbumrah93 #TeamIndia #INDvSL pic.twitter.com/hoZAmnvE2k— BCCI (@BCCI) January 3, 2020