సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అమలు చేయడానికి వ్యతిరేకిస్తూ అసదుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టుని శనివారం ఆశ్రయించారు. సవరించిన చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఓవైసీ తన పిటిషన్ లో పేర్కొన్నారు. రాజ్యాంగం లో ఆర్టికల్ 25 , 21 లని చట్టం ఉల్లంఘిస్తుందని కాబట్టి ఎంక్వయిరీ జరిగే వరకు నిలపివేయాలని సుప్రీంకోర్టు కోరారు.
పౌరసత్వ చట్టం 1955 లోని సెక్షన్ బి చట్టం విచారణలు పెండింగ్లో ఉన్న టైం లో ప్రభుత్వం ఎలాంటి పౌరసత్వ హోదా మంజూరు కోరుతూ దరఖాస్తులు స్వీకరించడం లేదా ప్రాసెస్ చేయడం లేదని ఓవైసీ కోర్టు కి తెలిపారు అయితే మరి ఈ విషయంలో ఏమైనా మార్పు చేస్తుందా కోర్టు లేదంటే ఈ మాటల్ని కొట్టిపారేస్తుందా అనేది చూడాలి.