నా చిన్నప్పటి కోరిక నెరవేరింది: నితిన్

-

హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు హీరో నితిన్. ప్రస్తుతం హీరో నితిన్‌ “మాచర్ల నియోజకవర్గం” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ను శేఖర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి నటిస్తుండగా.. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై తెరకెక్కుతోంది.ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పాటలు, గ్లింప్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా క్రియేట్ చేశాయి.

ఈ చిత్రం ఆగస్టు 12న (నేడు) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నితిన్ మాట్లాడుతూ.. తన చిన్నప్పటి కోరిక నెరవేరింది అంటూ చెప్పుకొచ్చాడు. తనని చిన్నప్పుడు ఎవరైనా పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే.. ఐఏఎస్ అవుతానని అనేవాడిననని.. కానీ పెద్ద అవుతూ వస్తుంటే మార్కులు తగ్గిపోతూ వచ్చాయని, ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం సినిమాలొ ఐఏఎస్ అధికారిగా నటించడంతో తన కోరిక నెరవేరింది అంటూ నితిన్ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version