సాధారణంగా మనకి నచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అన్న ఏమైనా సర్ప్రైజ్ చెయ్యాలన్న చాలా ఆలోచిస్తూ ఉంటాము. వాళ్ళని ఎలా సర్ప్రైజ్ చేయాలి…? వాళ్ళకి ఏ విధమైన గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది…? అని గంటలు గంటలు ఆలోచిస్తూ ఉండటం సహజం. అయితే ఎటువంటి గిఫ్ట్ ఇవ్వాలి అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ల కోసం ఈ టిప్స్….
క్యాంపింగ్ కి తీసుకెళ్లడం:
సరదాగా రోజు అంతా టెంట్, ఫుడ్ వగైరా వాటిని మీతో పాటు తీసుకువెళ్లి సరదాగా campfire తో వాళ్లని ఆశ్చర్యపరచవచ్చు. ఇది నిజంగా వాళ్ళు మరచిపోలేని రోజు అవుతుంది.
ఫోటోలు:
ఫోటోలు అన్నీ కలిపి ఫోటో కాలేజ్ చేసి వాళ్లకి ఫ్రేమ్ కట్టించి బహుమతిగా ఇవ్వొచ్చు. దీనికోసం వాళ్ళ చిన్నప్పటి నుంచి ఫోటోలు సేకరించి చేస్తే మరింత బాగుంటుంది.
ట్రిప్:
రదాగా వాళ్ళకి నచ్చిన ప్రదేశాలకి లేదా మీకు దగ్గరలో ఉన్న ప్రదేశాలని వాళ్ళను తీసుకెళ్లండి దీనితో రోజంతా మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది.
ఇంట్లోనే చిన్న సర్ప్రైస్:
ఇంట్లో చిన్న చిన్న గిఫ్ట్స్ ని కొన్ని కొని ట్రెజర్ హంట్ లాగ పెట్టి వాళ్ళని వెతుక్కోమని కాగితాల మీద రాసి సర్ప్రైజ్ చేయవచ్చు. ఆలా వెతుకునే సమయంలో ఫోటోలు, వీడియోలు కూడా తీసుకోండి.
క్యాండిల్ లైట్ డిన్నర్:
ఇంట్లో టేబుల్, లైట్స్, ఫుడ్ వగైరా అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకి నచ్చిన ఫేవరెట్ పిజ్జా కానీ బిర్యానీ కానీ ఇలా టేస్ట్ కి తగ్గట్టు ఫుట్ ని టేబుల్ మీద పెట్టి భలేగా సర్ప్రైజ్ చేయవచ్చు.