టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా చాలా భవిష్యత్తు ఉన్న యువ నటీనటులు కూడా ఆత్మహత్య చేసుకుంటూ ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా యువ నటుడు సుదీర్ వర్మ విశాఖలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకోవడం పలు సంచలనాలకు దారితీస్తోంది. ముఖ్యంగా ఈ వార్త విని ఆయన స్నేహితులు , సన్నిహితులే కాదు అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. నిజానికి సినిమాలలో అవకాశాలు రాలేదని ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
టాలీవుడ్ యువనటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య కేసులో ఇప్పుడు మరొక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆయన మూడు రోజుల క్రితమే పాయిజన్ తీసుకొని చనిపోయినట్టు పోస్టుమార్టం లో విశాఖ డాక్టర్లు రిపోర్టు ఇచ్చారు. నిజానికి పాయిజన్ తీసుకోవడానికి గల కారణాలు ఏమిటి? అసలు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది ?అనే కోణంలో కూడా విశాఖ పోలీసులు విచారణ చేపట్టారు. సుధీర్ వర్మ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు . తాజాగా కుందనపు బొమ్మ చిత్రంలో కూడా హీరోగా నటించాడు. వీటితో పాటు సెకండ్ హ్యాండ్ , షూట్ అవుట్ ఎట్ ఆలేరు వంటి సినిమాలలో కూడా సుదీర్ నటించి.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఇకపోతే అంతా బాగుందనుకునే సమయంలో ఇలా సూసైడ్ అటెంప్ట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే పాయిజన్ తీసుకోవడం వల్లే ఆయన మరణించాడు అని ప్రైవేట్ హాస్పిటల్ డెత్ రిపోర్ట్ చెబుతోంది. ముఖ్యంగా విషం తీసుకోవడంతో గుండెపోటు రావడం వల్లే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. అయితే మరికొంతమంది చెబుతున్న సమాచారం ప్రకారం ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండవచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సుధీర్ వర్మ కు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు.