ఆస్కార్ షార్ట్ లిస్టులో ట్రిపుల్ఆర్ నాటు నాటు సాంగ్

-

 

ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇండియాలో విడుదలయి సుమారుగా 10 నెలలు కావస్తున్నా.. ఇప్పటికీ ఈ సినిమాపై క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమాకు జనాలు ఎంతలా కనెక్ట్ అయ్యారు అంటే ఇప్పటికీ కూడా ఈ సినిమాలోని పాటలకు మాస్ స్టెప్పులేస్తూ ఇరగదీస్తున్నారు. ఇటీవల ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రాగా మరొకవైపు జపాన్ భాషలో కూడా తాజాగా విడుదలై అక్కడ కలెక్షన్లు సునామీ సృష్టిస్తోంది.

ముఖ్యంగా దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ దేశం గర్వించేలా చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు షార్ట్ లిస్ట్ అయింది. ఈ చిత్రంతో పాటు ‘ద లాస్ట్ ఫిల్మ్ షో’ అనే సినిమా కూడా 2023 ఆస్కార్స్ షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకుంది. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుత స్టెప్పులతో అలరించిన నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. ఈ ఘనత సాధించిన భారత చలనచిత్ర తొలి పాటగా ఇది రికార్డు సృష్టించింది. ఇక, అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ద లాస్ట్ ఫిల్మ్ షో షార్ట్ లిస్ట్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version