నాకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం..!!

-

బాలయ్య బాబు అన్ స్టాపబుల్  షో చేస్తూ  దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య తన చమత్కార మాటలు, హావభావాలతో , కొంటె ప్రశ్నలతో చెలరేగి పోతున్నాడు. బాలయ్య బాబు బాబు ప్రభావం తో షో విపరీతమైన రేటింగ్ రెస్పాన్స్ తో దూసుకొని పోతుంది. తాజాగా అన్ స్టాపబుల్ఎపిసోడ్ గెస్ట్స్ గా సీనియర్ హీరోయిన్స్ జయసుధ, జయప్రద హాజరయ్యారు.

వీరితో పాటు  యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా కూడా షో లో పాలు పంచు కుంది. ఇక ఈ ముగ్గురు హీరోయిన్స్ తో బాలయ్య బాబు  సరదా సంభాషణ హైలెట్ అయ్యింది. సీనియర్ హీరయిన్ల తో అప్పటి ఇప్పటి పరిశ్రమ గురించి కూడా మాట్లాడాడు. ఇక యంగ్ హీరోయిన్ రాశి ఖన్నాను ఆయన ఒక సీక్రెట్ ప్రశ్న అడిగారు. నువ్వు నటించి న హీరోలలో నీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు అని ఇరికించే ప్రయత్నం చేసాడు.

కాని రాశి ఖన్న  ఎంతో ఓపెన్ గా నాకు. విజయ్ దేవరకొండ అంటే బాగా ఇష్టం అని చెప్పింది. రాశి ఖన్నా గతంలో విజయ్ దేవరకొండ తో  వరల్డ్ ఫేమస్ లవర్ లో నటించింది. ఆ సినిమా ప్లాప్ అయినా కూడా అందులో ఇద్దరూ హాట్ హాట్ సన్నివేశాలలో పోటీ పడి మరీ నటించారు. ఇక విజయ్ దేవరకొండ విషయం కు వస్తే చాలా మంది యంగ్ హీరోయిన్స్ తమకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టం అని చెప్పారు. వారిలో హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version