సమంత తన ఎక్స్ హస్బెంగ్ గురించి ఏమందో తెలుసా… మంచు లక్ష్మీముందు ఓపెన్ అయిన సమంత

-

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ గా ఉన్న నాగచైతన్య-సమంత విడిపోవడం సంచలనం కలిగించింది. ‘ఏం మాయ చేశావే’ సినిమాతో దగ్గరైన వీరిద్దరు… తరువాత ప్రేమించుకున్నారు. 2017లో పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే గతేడాది 2021లో అక్టోబర్ 2న తామిద్దరం విడిపోతున్నట్లు ఉమ్మడి ప్రకటన చేశారు నాగచైతన్య, సమంత. నాలుగేళ్ల తమ వివాహ బంధానికి బ్రేక్ చేసుకున్నారు. వీరిద్దరి మధ్య భేదాబిప్రాయాలే.. ఇద్దరి మధ్య విడాకులకు కారణం అయ్యాయని తెలుస్తోంది.

వివాహం తరువాత 2019లో ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ కార్యక్రమంలో పాల్గొంది. ఆ సమయంలో హోస్ట్ గా ఉన్న మంచు లక్ష్మీ ముందు నాగచైతన్య విషయంలో ఓపెన్ అయింది. నాగ చైతన్యపై ప్రశంసలు కురిపించింది. ‘ హస్బెండ్ మెటీరియల్’ అంటూ తెగపొగిడింది. నా దగ్గర ఏమీ లేనప్పటి నుంచి నాగచైతన్య చూశాడని.. యూఎస్ నుంచి ఫోన్ చేసుకునేందుకు డబ్బులు లేని సమయంలో కూడా తన ఫోన్ ద్వారానే తన తల్లితో మాట్లాడానని గుర్తు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పెళ్లికి ముందు లివ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లుగా ఆసయమంలో సమంత మంచులక్ష్మీకి వెల్లడించింది. ప్రస్తుతం వారి ఫ్యాన్స్.. గతంలో సమంత, నాగచైతన్య ఇచ్చిన ఇంటర్వ్యూలను తలుచుకుని తెగ బాధపడుతున్నారు.

విడాకుల ముందు ఇన్ స్టా గ్రామ్ లో చైతన్య పేరును తొలగించడంతో నెటిజెన్లు అనుమానం వ్యక్తం చేశారు. దీని తర్వాత కొన్ని రోజులకే ఇద్దరు విడాకుల తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version