చైతూతో రొమాన్స్ చేయనున్న రష్మిక?

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా అందమైన జంట ఏది అంటే గుర్తుకు వచ్చేది.. అక్కినేని నాగచైతన్య- సమంత అనే చెబుతారు. కానీ ఆరు నెలల కిందట.. తమ వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించేశారు. ఇక విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది సమంత.

ఇక అటు వరుస హిట్లతో జోరు మీదున్న నాగ చైతన్య ఖాతాలో మరో హిట్‌ పడనున్నట్లు కనిపిస్తోంది. లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుస హిట్లు కొట్టిన చైతు ఇప్పుడు ‘థ్యాంక్యూ’ సినిమా మాత్రం డీలా పడ్డాడు. థ్యాంక్యూ బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోవడంలో విఫలమైన కారణంగా నాగ చైతన్యకు ఎదురుదెబ్బ తగిలింది.

ఇక ఇప్పుడు ఈ స్టార్.. లాల్ సింగ్ చద్దాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ మూవీ రిలీజ్ కాకముందే చైతూ నెక్స్ట్ ప్రాజెక్టు అప్‌డేట్ వచ్చింది. చైతూ హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో రష్మిక మందన్నతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే, దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ లేదు. త్వరలోనే ప్రకటన రానుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version